తెల్లగా ప్రకాశవంతమైన చర్మం చాలా ఆకర్షనీయం గా ఉంటుంది.అయితే ఆ తెల్లని చర్మం కోసం చాలా మంది ఎంతో ఖర్చు చేస్తూ అనేక పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. కాని ఇంట్లో సొంతగా తయారు చేసిన ఫేస్ పాక్స్ ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఖర్చు కూడా తక్కువ.అలాంటివి కొన్ని చూద్దాం..
బ్లీచింగ్ ఏజెంట్స్ బంగాళదుంప లో పుష్కలంగా ఉండడం వలన నలుపు ను పోగొట్టి చర్మం ఛాయను పెంచుతుంది . నెలకి మూడు సార్లు బంగాళదుంప తో ప్యాక్ వేసుకుంటే మంచి మార్పు పొందుతారు . బంగాళదుంప ను పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటి తో శుభ్రం చేసుకోవాలి.
మీరు బాగా తెల్లగా కనబడాలంటే, పాలను వాడాల్సిందే. కాటన్ బాల్స్ తీసుకుని పాలలో ముంచి , ముఖం అంతా శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చక్కని చర్మ ఛాయ మీ సొంతమవుతుంది.
కలబంద చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మ మీద నలుపును తగ్గించడం తో పాటు ముఖం మీద ఏర్పడ్డ మచ్చలను పోగొడుతుంది. కలబంద మొక్కనుండి కట్ చేసి దానిలో ఉండే జెల్ ను ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు ముఖం, మెడకు రాసుకోవాలి.
కీర దోసకాయ రసం కీ తేనె కలిపి ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల ముఖం లో వచ్చే తేడా స్పష్టం గా కనిపిస్తుంది. మార్పు వస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ను వారం లో ఒకసారి ముఖం, మెడకు పట్టించడం వల్ల మంచి రిసల్ట్ కనబడుతుంది .
చర్మం తెల్లగా మార్చడంలో సిట్రస్ పండ్లు బాగా పనిచేస్తాయి. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేసి, ఆ పొడికి కొంచెం పాలుకలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకుని ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడకు అప్లై చేసుకుని ఆరిన తర్వాత చల్లటి నీటి తో శుభ్రం గా కడిగేసుకోవాలి.