Home appliances: నూతన సంవత్సరవేళ ఓ బ్యాడ్ న్యూస్. ఇంటికి కావలసిన పలు వస్తువులు ధరలు ఈ సందర్భంగా పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తాజా నివేదికలు ఏం చెప్తున్నాయంటే, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, కన్సూమర్ గూడ్స్ కంపెనీలు మరికొన్ని రోజుల్లో ధరలను పెంచొచ్చని వెల్లడిస్తున్నాయి. దీనికి అనేక కారణాలను కారణాలుగా చూపెడుతున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగిపోవడం, ఉత్పత్తి వ్యయాలు, సరఫరా అడ్డంకులు వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. FMCG (మూవింగ్ కన్సూమర్ గూడ్స్) కంపెనీలు వస్తువుల ధరలను వచ్చే 2 నెలల కాలంలో 4-10 శాతం వరకు పెంచొచ్చని సమాచారం.
Vaccine: త్వరలో ప్రారంభం కానున్న చిన్నపిల్లల కరోనా వ్యాక్సినేషన్.. ఇది కావాలి!
ఏయే వస్తువుల ధరలు పెరగబోతున్నాయి?
ఈ సందర్భంగా అనేక రకాల హోమ్ నీడ్స్ పైన ధరలు పెరగనున్నట్టుగా తెలుస్తోంది. వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ ధరలను మళ్లీ 6-10 శాతం వరకు పెంచేందుకు సదరు కంపెనీలు సిద్ధంగా వున్నాయి. 2020 నుంచి చూస్తే ఈ కంపెనీలు ప్రొడక్టుల ధరలను పెంచడం వరుసగా ఇది 4వ సారి కావడం కొసమెరుపు. అలాగే పలు వాహన ధరలు కూడా పెరగనున్నాయి. హీరో మోటొకార్ప్ ఇటీవలనే ధరల పెంపు ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో జనవరి 4 నుంచి టూవీలర్ ధరల పెంపు అమలులోకి వస్తుందని తెలుస్తోంది.
Chamoline Tea: చామంతి టీ తో మీ అందం రెట్టింపు..!!
ఇపుడు ఏయే కంపెనీల వస్తువుల ధరలు పెరగనున్నాయి?
తాజా సమాచారం ప్రకారం, పలు వాహన కంపెనీలు ధరలు పెంచబోతున్నాయి. అందులో హిందుస్తాన్ యూనిలివర్, డాబర్, బ్రిటానియా, మారికో వంటి పలు కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీలు దాదాపు 5-12 శాతం మేర ధరలు పెంచనున్నాయి. నూతన సంవత్సరవేళ కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ లేకపోలేదు. అలాగే ఎడిబుల్ ఆయిల్ ధర కూడా పెరిగే అవకాశం మెండుగా ఉంది. కనుక మిత్రులారా మీరు ఏమైనా కొనాలనుకుంటే ఇప్పుడే సర్దుకోండి.