NewsOrbit
న్యూస్

కాళ్లు పగిలాయా? అయితే ఇలా చెయ్యండి!

చలికాసలం వచ్చిందంటే చాలా సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. ఇవీ చాలవన్నట్టు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వేధిస్తుంటాయి. అందులో ముఖ్యంగా ముఖం డ్రైగా మారడం, కాళ్లు చేతులు పొడి బారడం, పొలుసులుగా ఏర్పడం వంటి సమస్యలు వస్తుంటాయి. అందులోనూ మరీ ముఖ్యంగా అరి కాళ్లు పగుళ్లకు గురవుతుంటాయి. ఈ పగుళ్ల సమస్య ఏర్పడిన చాలా మంది నడవడానికి కూడా ఇబ్బందిపడుతుంటారు. అందులోనూ ఆ పగుళ్ల నుంచి రక్తం కారుతూ చాలా నొప్పి పుడుతుంటుంది. దాంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఆ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల క్రిములను వాడుతుంటారు.

కాని అవి వాడటం మూలంగా ప్రస్తుతం కొంచెం ఉపశమనం లభించినా మళ్లీ ఆ సమస్య పునరావృతం అవుతుంటాయి. ఈ స‌మ‌స్య‌ను నివారించే మార్గాన్ని సుల‌భంగా ఇంటిలోనే త‌యారు చేసుకొని ఈ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌రి అదేలాగో చ‌దివేయండి.. చలి కాలంలో మ‌న పాదాలు స్మూత్ నెస్ ను పూర్తిగా కోల్పోయి పొలుసులు మారి బ‌రుకుగా త‌యావుతాయి. దాని త‌రువాత ప‌గుళ్లు ఏర్ప‌డి ప‌గుళ్ల నుంచి ర‌క్తం కారుతూ ఇబ్బంది పెడ‌తాయి. దానికి మీరు చేయ‌వ‌ల‌సిన సుల‌భ ప‌ద్ద‌తుంది. అదేంటంటే నువ్వుల నూనెను తీసుకుని అందులో రెండు మూడు చుక్క‌ల గ్లిజ‌రిన్ ను వేసి వాట‌న్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఆ మిశ్ర‌మాన్ని పాదాల‌కు ప‌ట్టించి మ‌సాజ్ చేయాలి.

ఇలా చేయ‌డం మూలంగా పాదాలకున్న ప‌గుళ్లు పోతాయి. ఈ ప‌ద్ధ‌తితో పాటుగా మ‌రో విధంగా కూడా చెక్ పెట్టొచ్చు. ఒక ట‌బ్ తీసుకొని అందులో ‌స‌గం వర‌కు గోరువెచ్చ‌టి నీటిని తీసుకోవాలి. అందులో రెండు టీ స్పూన్ల గ్లిజ‌రిన్‌, ఆలివ్ ఆయిల్ ను క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మంలో పాదాల‌ను కాసేపు ఉంచాలి. ఆ త‌ర్వాత పాదాల‌ను తీసి మ‌సాజ్ చేసి మాయిశ్చ‌రైజ‌ర్ రాస్తే స‌రి. ఈ ప‌ద్ద‌తిని 15 రోజుల‌కొక‌సారి చేస్తే మంచి ఫ‌లితాల‌ను పొంద‌వచ్చును. అలాగే పెరుగు, వెనిగ‌ర్ ను రెండింటినీ స‌మానంగా తీసుకుని వాటిని మిక్స్ చేసి పాదాల‌కు ప‌ట్టించి మ‌సాజ్ చేస్తే పాదాలు మెత్త‌గా మార‌తాయి.

అలాగే నైట్ టైం ప‌డుకునే ముందు హ్యాండ్ క్రీమ్ ను తీసుకుని అందులో కూసింత నిమ్మ‌రసం క‌ల‌పాలి. ఆ దాన్ని పాదాల‌కు రాసి మ‌సాజ్ చేస్తే ప‌గుళ్ల స‌మ‌స్య నుంచి ఉప‌శమ‌నం పొంద‌వ‌చ్చును. అల‌గే మ‌ల్తానీ మ‌ట్టిని తీసుకుని దాంట్లో కొంత రోజ్ వాట‌ర్ క‌లిపాలి. ఆ మిశ్ర‌మాన్ని పాదాల‌కు రాయాలి. కొద్ది సేప‌టి త‌రువాత దాన్ని చ‌న్నీళ్ల‌తో క‌డిగి మాయిశ్చ‌రైజ‌ర్ ను రాసుకుంటే ప‌గుళ్లు మీ ద‌రిచేర‌వు. వారానికి 2 సార్లు ఇలా చేస్తే పాదాలు మృదువుగా త‌యార‌వుతాయి.

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju