Dark Neck: ముఖంతో పాటు మెడ అదే రంగులో ఉంటే అందంగా కనిపిస్తారు.. కొంతమందిలో మాత్రం ముఖం తెల్లగా ఉండి మెడ మాత్రం నల్లగా ఉంటుంది.. ఎండలో తిరగడం, వయసు పెరగడం, జీన్స్, పిసిఓఎస్, ఉన్నట్టుండి బరువు పెరగడం లేదా తగ్గడం, ఒత్తిడి వంటి కారణాలు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.. మార్కెట్లో లభించే గిల్ట్ నగలు ధరించడం, గరుకుగా ఉండే ఆభరణాలు వేసుకోవటం, మెడ గురించి సరిగ్గా శ్రద్ధ తీసుకోకపోవడం మరో కారణం.. కారణాలు ఏమైనప్పటికీ మెడ వెనక భాగంలో నల్లగా ఉంటే చూడటానికి అస్సలు బాగుండదు.. అయితే ఇందుకోసం పార్లల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు.. మన ఇంట్లో లభించే వస్తువులతోనే వీటికి చెక్ పెట్టవచ్చు..!! మెడ వెనక నలుపు తగ్గి తెల్లగా మారిపోయే అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!
మెడ వెనక నలుపు పోవడానికి రెండు ప్యాక్స్ అవసరం.. ఇందుకోసం ముందుగా రెండు చెంచాలు బరకగా పట్టిన పెసరపిండిని తీసుకోవాలి. ఇందులో సరిపడినంత తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెడపై స్క్రబ్ చేయాలి. పెసర పిండి శరీరంపై పేరుకుపోయిన మృతకణాలను, నలుపును పోగొట్టి తెల్లగా మారుతుంది. తేనె కూడా సహజంగా పేరుకుపోయిన మురికిని తొలగించి తక్షణ కాంతిని అందిస్తుంది. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత మరో ప్యాక్ ను వేసుకోవాలి.
ఇందుకోసం విటమిన్ క్యాప్సిల్ ఒకటి, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ గ్లిజరిన్ తీసుకోవలి. ఒక గిన్నెలో ఈ మూడింటినీ వేసి బాగా కలుపుకోవాలి.. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మెడ కి రాసుకుని నిద్రపోవాలి. ఉదయం లేచాక శుభ్రంగా కడుక్కోవాలి.. ఇలా చేస్తే మెడ మీద ఉన్న నలుపు పోయి తెల్లగా అవుతుంది.. విటమిన్ ఇ శరీరం చాలా అవసరం. విటమిన్ ఇ ముఖ్యంగా చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.. అన్ని రకాల చర్మ సంరక్షణ ఔషధాలలో దీనిని ఉపయోగిస్తారు. విటమిన్ ఈ క్యాప్సిల్స్ చర్మాన్ని తెల్లగా మారుస్తాయి.. ఇందు లో ఉపయోగించిన గ్లిజరిన్ శరీరం పై పేరుకుపోయిన మురికినీ, మృతకణాలను తొలగిస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని తేమగా చేస్తుంది. చర్మం లోని సహజసిద్ధమైన మెరుపును తిరిగి అందిస్తుంది. మెడపై పేరుకుపోయిన నలుపు తొలగించడానికి ఈ రెండు చిట్కాలు అద్భుతంగా పని చేస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రయత్నించి చక్కటి ఫలితాలను పొందండి.