ఇల్లు ఎప్పుడు సువాసన వస్తూ ఉంటే ఆ ఇంటిలోనివారికి మానసికం గా ఎంతో ఆనందం కలుగుతుంది. అలా సువాసన రావడానికి డబ్బు ఖర్చు పెట్టకుండా ఇంటి లోనే ఉండే వా 4టితో మనమే సొంతం గా ఫ్రెషనర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పులావు లో వేసే బే ఆకులు కొన్ని, కొద్దిగా దాల్చిన చెక్క, నిమ్మ తొనలు తీసుకుని ఇవన్నీ ఓ గిన్నె లో వేసి,గదిలో ఓ మూల ఉంచండి. అలా ఉంచడం వలన నాలుగైదు గంటల పాటూ మీకుమంచి సువాసన వస్తూ ఉంటుంది.
నిమ్మ తొనలు లేకపోతే, కమలాపండు తొక్కలు, తొనలు వేసినా కూడా అదే ఫ్రెష్నెస్ ను ఇస్తాయి. వంటగది నుండి వచ్చే రక రకా ల వాసనలను పోగొట్టడానికి ఓ గిన్నె లో కొంత నీరు పోసి, చిన్న దాల్చిన చెక్క, 3 యాలకులు,కొన్ని బే ఆకులు వేసి ఉడకబెట్టండి. అవి ఉడుకుతున్నప్పుడు, స్టవ్ మంటను తక్కువగా పెట్టండి. ఇలా కాసేపు ఉంచితే.. వంటగది మొత్తం సుగంధ పరిమళాలతో నిండిపోతుంది.
ఇక ఎంతసేపూ అక్కడే ఉండాలనిపించే అంత తాజా గాఉంటుంది.ఓ చిన్న కార్డ్ బోర్డ్ బాక్సు లో కొద్దిగా తినే సోడా, కొన్ని చుక్కల సువాసనలు వచ్చే నూనె వెయ్యండి. బాక్సు పైన ఓ చిన్న కన్నం ఉండాలి. కన్నం లేకపోతే… మీరే కన్నం పెట్టండి. దీన్ని మీరు బాత్ రూం లేదా ఏదైనా గది లో ఓ మూల ఉంచారంటే, చెడు వాసనలు, కంపు వంటివి అన్నీపోతాయి. అయితే పదిహేను రోజులకుఒకసారి మళ్ళి కొన్ని నూనె చుక్కలువేస్తూ ఉండడం వలన చాల ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది .