ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త మోడల్స్, లేటెస్ట్, అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్న స్పోర్ట్స్ బైక్స్ కోసం యువత ఎదురు చూస్తుంటుంది.. అటువంటి స్పోర్ట్స్ బైక్స్ అందించడంలో హోండా ముందుంటుంది.. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తాజాగా గ్రాజియా స్కూటర్ స్పోర్ట్స్ వెర్షన్ ను మార్కెట్లో విడుదల చేసింది.. సరికొత్త ఫీచర్స్ తో ఈ Honda grazia sports edition మార్కెట్లో సందడి చేస్తుంది.. దీని ప్రత్యకతలు ఇలా ఉన్నాయి..
ఫీచర్స్ :
Honda grazia sports edition మెరుగైన స్మార్ట్ పవర్ తో బి ఎస్ సిక్స్ కంప్లైంట్ 125cc ఇంధన ఇంజెక్ట్ సింగిల్ సిలిండర్ హోండా ఎకో టెక్నాలజీ తో ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 8.52 హెచ్‌పి పవర్ ను, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 10.3 ఎన్ఎమ్ ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కట్ ఆఫ్, ఇంటిగ్రేటెడ్ పాస్ స్విచ్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ ఫంక్షనల్ స్విచ్,సైడ్ స్టాండ్ ఇండికేటర్ కట్ ఆఫ్ కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి.
గ్రాజియా స్కూటర్ స్పోర్ట్స్ స్పెషల్ ఎడిషన్ రెండు కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ. 82,564 నుండి ప్రారంభం అవుతుంది. గ్రాఫిక్స్ సహా కొత్త వెర్షన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అత్సుషి ఓగాటా తెలిపారు.
ఇది కూడా చదవండి : కీలక నిర్ణయం తీసుకున్న ఫేస్ బుక్.. అదేంటో చూడండి.. యూజర్లకు షాకేనా..