బైక్ కొనాలనుకునే వారికి మొదట గుర్తుకొచ్చే కంపెనీలలో ఒకటి హోండా.. ఎందుకంటే హోండా సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది.. అంతే కాకుండా తన ఉత్పతులతో పాటు విక్రయాయాలు కూడా దూసుకెళ్తున్నాయి అనడానికి ఇదే ఉదాహరణ.. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజమైనా ప్రముఖ వాహనాల సంస్థ హోండా ఉత్పత్తి చేస్తున్న షైన్ మోటార్ సైకిల్ అమ్మకాల పరంగా గా ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది..
2006లో మార్కెట్లో విడుదలైన షైన్ మోటార్ సైకిల్ ఇప్పటి వరకు 90 లక్షల బైకులు విక్రయించినట్లు హోండా అధికారులు తెలిపారు. 2020 లో ఆటో మొబైల్ రంగం కరోనా కారణంగా కష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ 125 సిసి సెగ్మెంట్లో అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయని వివరించారు.
సుమారు 14 సంవత్సరాల కిందట షైన్ భారత రోడ్లపై పరుగులు తీయడం మొదలు పెట్టింది . కేవలం యాభై నాలుగు నెలల కాలంలోనే 10 లక్షల కస్టమర్లను సొంతం చేసుకుంది. షైన్ ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లలోనే బెస్ట్ సెల్లింగ్ మోటార్‌సైకిల్ గుర్తింపు తెచ్చుకుంది. 2018 నాటికి దేశంలో అమ్ముడయ్యే ప్రతి రెండు బైక్ లలో 125 సిసి బైక్ ఒకటని కంపెనీ యాజమాన్యం తెలిపారు.
కస్టమర్లకు ఇది నెంబర్‌వన్ ఛాయిస్ గా మారింది. హోండా షైన్ ఈ విభాగంలో అత్యధికంగా 35 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. గత నవంబర్ 2020 నెలలోనే హోండా గరిష్టంగా 94413 షైన్ మోడల్స్ ను విక్రయించింది. అంతకుముందు సంవత్సరం నవంబర్ 2019 నెలలో 75114 యూనిట్ల షైన్ మోడల్స్ ను విక్రయించింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఇవి 26 శాతం వృద్ధిని సాధించాయి. ఈ బైక్ ఇది ఇంజన్‌తో లభిస్తుంది. బి ఎస్ 6 ఇంజిన్ గరిష్టం గా 10.72 బిహెచ్పి ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో జత చేశారు. రాన్నున్న రోజుల్లో మరిన్ని సంఖ్యలో అమ్ముడవుతాయని కంపెనీ ఆశాజనకంగా ఉంది.