న్యూస్ రాజ‌కీయాలు

TDP: రాష్ట్రవ్యాప్తంగా కీలక టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు..!!

Share

TDP: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి నిన్న తీవ్రస్థాయిలో సీఎం జగన్ ని ఉద్దేశించి పరుష పదజాలంతో విమర్శలు చేయటం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై అదేరీతిలో పట్టాభి ఇంటిపై వైసీపీ పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడటం జరిగింది. దీంతో పార్టీ కార్యాలయాలపై నాయకులపై.. జరిగిన దాడులకు నిరసనగా చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కి పిలుపునివ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ కార్యకర్తలను ఎవరిని రోడ్డు పైకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

TDP alliance with Congress to end Modi rule: Uma Maheswara Rao

ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరినీ.. హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే తరుణంలో కృష్ణాజిల్లా గొల్లపూడి లో మాజీ మంత్రి దేవినేని ఉమని.. గొల్లపూడి వన్ సెంటర్ లో నిరసన తెలపడానికి వచ్చే సమయములో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు తనపై చర్యలు తీసుకోవటం ని ఖండిస్తూ రాష్ట్రంలో ఆటవిక అరాచక పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై వైసీపీ దాడి చేస్తే దానికి నిరసనగా బంద్ చేపట్టడం తప్పా అని విమర్శించారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిన వెంటనే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ.. ఇటువంటి సంఘటన వినటం తొలిసారి అని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. కేంద్ర హోంశాఖ స్పందించాలి పోలీసులు.. ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవాలని కోరారు.

Rajamahendravaram: TDP condemns arrest of CPI leaders - Thehansindia |  DailyHunt

అదేవిధంగా వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామ కృష్ణం రాజు కూడా ఖండించారు. ఇదిలా ఉంటే మరో పక్క.. కావాలని చంద్రబాబు నాయుడు తన పార్టీకి చెందిన నాయకులు చేత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించి రాష్ట్రంలో.. శాంతిభద్రతల సమస్యలు సృష్టించి పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవడం కోసం దొంగ నాటకాలు ఆడుతున్నటు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. సీఎం జగన్ కి ప్రజలలో కలుగుతున్న ఆదరణ ఓర్చుకోలేక చంద్రబాబు దగ్గరుండి ఈ దాడులు చేస్తున్నట్లు.. వైసీపీ నాయకులు అంటున్నారు. ఏదిఏమైనా టిడిపి అధికారి ప్రతినిధి పట్టాభి.. జగన్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.


Share

Related posts

Breaking: స్పైస్ జెట్ విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం … 185 మంది ప్రయాణీకులు సేఫ్ ..

somaraju sharma

వామ్మో.. సిగరెట్ పీక ఎంత డేంజరు!

Teja

Bahubali: ప్రపంచవ్యాప్తంగా మ్యాజిక్ క్రియేట్ చేసిన “బాహుబలి”.. ప్రభాస్ షేర్ చేసిన ఫోటో వైరల్..!!

bharani jella