ఎస్ఐ సుభోద్‌ను హత్య చేసింది ఎవరో తెలుసా ?

ఉత్తరప్రదేశ్‌లోని బులందశహర్ జిల్లా చింగ్రావతి గ్రామంలో గోవధపై జరిగిన హింసాకాండలో ఇన్స్ పెక్టర్ మృతికి కారకుడైన ముద్దాయిని మూడు వారాల తరువాత పోలీసులు అరెస్టు చేశారు. ఆవుల కళేబరాలు కనిపించడంతో ఈ నెల మూడున గ్రామంలో పెద్ద ఎత్తున భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన సమయంలో ఎస్ఐ సుభోధ్ కుమార్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు.

సుబోధ్ కుమార్ రివాల్వర్‌తోనే ఆయనపై కాల్పలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.  ఈ దుర్మార్గానికి పాల్పడిన ప్రశాంత్ నట్ అనే యువకుడిని అరెస్టు చేశారు. జానీ అనే మరో వ్యక్తి సుభోద్ కుమార్ సింగ్ నుండి రివాల్వర్ లాక్కున్నాడని తాజాగా పోలీసులు గుర్తించారు. ప్రశాంత్ నట్‌ను బులంద్‌శహర్ – నోయిడా సరిహద్దులో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రభాకర్ చౌదరి చెప్పారు. వీరిద్దరు బులందశహర్ నివాసులేననీ, ఆనాడు తీసిన వీడియో పుటేజ్ ఆధారంగా వీరిని గుర్తించామన్నారు. ప్రధాన నిందితుడు భజరంగ్‌దళ్‌కు చెందిన యోగేష్ రాజ్ ఇంకా పరారీలో ఉన్నాడు.