Pooja hegde : పూజా హెగ్డే కి టాలీవుడ్, బాలీవుడ్ ఇవ్వని రెమ్యూనరేషన్ కోలీవుడ్ లో అందుకోబోతోందని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు రాసేస్తున్నారు. పూజా హెగ్డే కి ఇటు టాలీవుడ్ లో గాని అటు బాలీవుడ్ లో గాని భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న మాట వాస్తవం. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. దర్శక, నిర్మాతలల్లో స్టార్ హీరోలలో కూడా పూజా హెగ్డే అంటే బాగా క్రేజ్ ఉంది. అందుకే ఇక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది.
అయితే ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీకి కొత్త ప్రాజెక్ట్ ఏదీ చేతిలో లేదు. తెలుగులో కమిటయిన ప్రభాస్ రాధే శ్యాం, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలు పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ముంబై లో హిందీ సినిమాలతో బిజిగా ఉంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటిస్తున్న సినిమా పూజా హెగ్డే చేతిలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నట్టు సమాచారం.
Pooja hegde : పూజా హెగ్డే .. విజయ్ సినిమాలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం ..?
అయితే గత కొన్ని రోజులుగా పూజా హెగ్డే కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోందని .. అది కూడా పాన్ ఇండియన్ స్టార్ హీరో విజయ్ సినిమాతో అని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్న కారణంగా పూజా గెగ్డే కి దాదాపు 3.5 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. కాని ఇంతక ముందే పూజా హెగ్డే .. విజయ్ సినిమాలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఇక్కడ గాని బాలీవుడ్ లో గాని ఇవ్వని రెమ్యునరేషన్ కోలీవుడ్ లో ఎలా ఇస్తారన్నది ఎవరికీ అర్థం కాని విషయం.