NewsOrbit
న్యూస్

ఆ నేత ఎంత లక్కీ అంటే సిఎం నుండే అభినందనల ఫోను వచ్చింది.

సాధారణంగా ముఖ్యమంత్రి జగన్ ఎవరినీ పొగడరు.వారి పనితీరును తెలుసుకుని తనకంటూ ఒక అంచనా వేసుకుని అవసరమైన సమయంలో మాత్రమే జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.కానీ ఇందుకు భిన్నంగా ఒక గిరిజన వైసిపి నాయకుడు చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ముగ్ధుడైన ముఖ్యమంత్రి నేరుగా ఆయనకే పోను చేసి అభినందనలు తెలపటం పార్టీలో చర్చనీయాంశమైంది.జగన్ ను ఇంతగా ఆకట్టుకున్న నేత తెల్లం బాలరాజు.






మ‌న్యం నాడి తెలిసిన నాయ‌కుడిగా ఎదిగిన తెల్లం బాల‌రాజు.. గిరిజ‌న ప‌క్ష‌పాతిగా మారారు. గిరిజ‌న నాయ‌కుడిగా ఎదిగిన ఆయ‌న గ‌తంలోనూ, ఇప్పుడు కూడా వారి స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు. వారి ప‌క్షానే నిల‌బ‌డుతున్నారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అడవిబిడ్డల ఆకలితీర్చేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలను సమాయత్తం చేసి కొండలు, వాగులు, వంకలు దాటుతూ మారుమూల గిరిజన గ్రామాలకు చేరుకుని నిత్యావసర సరుకులు, కూరగాయలు అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీస్తున్నారు.



ఇలా ఇప్పటివరకు 56 గిరిజన గ్రామాల్లో పర్యటించి సుమారు రూ.75 లక్షల విలువైన నిత్యావసరాలు అందించారు. ఇటీవ‌ల‌ మరో సాహసోపేతమైన పర్యటన చేశారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న బుట్టాయగూడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మోతుగూడెం గ్రామాన్ని సందర్శించారు. యాక్షన్‌ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిత్యావసర సరుకులు, కూరగాయలను 150 గిరిజన కుటుంబాలకు అందించారు. వాస్త‌వానికి మోతుగూడెం పర్యటన సాహసంతో కూడుకున్నది. ఎత్తయిన కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సరైన రహదారి లేని ఈ గ్రామానికి వెళ్లాలంటే సుమారు ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే. దశాబ్దాలుగా ఈ గ్రామ గిరిజనులకు కాలిబాటే ఆధారం.

దివంగత సీఎం వైఎస్‌ హయాంలో కొంతమేర రహదారుల నిర్మాణం జరిగినా మరి కొంతమేర రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుపై ఎమ్మెల్యే బాలరాజు కొంత మేర ద్విచక్ర వాహనంపై, మరి కొంతమేర కాలినడకన నిత్యావసర వస్తువులు మోసుకుంటూ వెళ్లి మోతుగూడెం గిరిజనులకు అందించారు. గ్రామానికి చెందిన గోగుల కమలమ్మ అనే కొండరెడ్డి గిరిజన మహిళ ఇంట్లో గొడ్డు కారంతో భోజనం చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. మొత్తంగా గిరిజ‌న బిడ్డ‌గా వారి ఓట్ల‌తో సంపాయించుకున్న అధికారాన్ని తిరిగి వారికే బాలరాజు అంకితం చేశారు. ఈ విష‌యంపై తాజాగా సీఎంవోలో చ‌ర్చకు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. బాల‌రాజు సేవా దృక్ఫ‌థంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన సీఎం జ‌గ‌న్‌ నేరుగా ఆయ‌న‌కు స్వ‌యంగా ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలిపారు.ముఖ్యమంత్రి మన్ననలు అందుకున్న బాలరాజుకు పార్టీలో ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు.

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!