జీడిపప్పును రోజూ తినొచ్చు… కానీ ఎన్ని తినాలి?

మనలో చాలామందికి  ఉన్న అపోహ ఏమిటంటే జీడిపప్పులో  కొలెస్ట్రాల్ ఉండడం వల్ల తింటే లావు అవుతారని. కానీ, జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఇది గుండెకు ఎలాంటి హాని చేయదు. జీడిపప్పులో మెగ్నీషియం లెవెల్స్ అధికంగా ఉండటం వలన ఎముకల బలానికి ఇవి చాలా సహాయపడతాయి. మన శరీరానికి రోజులో సుమారుగా 300 నుంచి 700mg మెగ్నీషియం అవసరమవుతుంది కాబట్టి జీడిపప్పును రోజూ తీసుకుంటే ఆ మెగ్నీషియంను ఇవి అందిస్తాయి.

జీడిపప్పును రోజూ తినొచ్చు… కానీ ఎన్ని తినాలి?రక్తపోటు ఉన్నవారు కూడా జీడిపప్పును ఎలాంటి భయము లేకుండా తీసుకోవచ్చు. జీడిపప్పులో సోడియం శాతం తక్కువగా మరియు పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. జీడిపప్పులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ సమస్యను మీ దరిచేరనివ్వదు. వీటితో పాటు సెలీనియమ్ మరియు విటమిన్ ఇ వీటిలో ఉండటంతో ఇవి కేన్సర్‌ను రాకుండా అడ్డుకుంటాయి.

శరీరానికి కావలిసిన శక్తిని అందించడంలో జీడిపప్పు ఎంతో సహాయపడుతుంది. మీకు మానసిక ఆరోగ్యాన్ని కూడా జీడిపప్పు అందిస్తుంది. జీడిపప్పులో ఉండే ఫైబర్ ఉండడం వలన వీటిని తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

జీడిపప్పులో లభ్యమయ్యే కొవ్వు మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. జీడిపప్పు మన శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. అందువల్ల, ప్రతిరోజూ మీరు 3-4 జీడిపప్పులు తినవచ్చు తీసుకోవచ్చు.

జీడిపప్పులో మాంసకృతులు, కొవ్వు పదార్ధాలతో పాటు విటమిన్ బి1, బి2, బి3 బి5, బి6, సి, కాల్షియం, ఇరన్, మెగ్నీషియమ్, పొటాషియం, జింకు వంటి అనేక మానవ శరీరానికి అవసరమైన ఖనిజ లవనాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి.