NewsOrbit
జాతీయం న్యూస్

Corona Breaking: ఒక్క శ్మశానంలో ఇన్ని శవాలా..!? కాటిలో కన్నీరు తెప్పించే దారుణ కథలు..!!

Corona Breaking: కరోనా కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ఆస్పత్రుల్లో వైద్యులు ..సిబ్బందే కాదు. ..ఇంకో చోట కూడా ఉద్యోగులు రోజంతా పని చేస్తూనే ఉన్నారు.నిజానికి అందరికన్నా వీరి మీదే ఎక్కువ పని భారం పడింది.ఊపిరి పీల్చుకోవడానికి కూడా వారికి సమయం చిక్కడం లేదు.అలాగని వారు తమ పనిని వాయిదా వేసే అవకాశం కూడా లేదు.ఇంకా చెప్పాలంటే వారే అసలైన కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్!

How many corpses in one cemetery ..!?
How many corpses in one cemetery

ఇంతకీ వారెవరంటే!

శ్మశాన వాటికల్లో పనిచేసే ఉద్యోగుల గురించే ఈ ఉపోద్ఘాతమంతా!దేశమంతా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నా రాజధాని ఢిల్లీలో మరింత దారుణమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో బాగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి.మహారాష్ట్ర కు ఈ విషయంలో మొదటి స్థానం రాగా ఢిల్లీ తర్వాతి స్థానంలో నిలిచింది. ఏప్రిల్ ఇరవై వ తేదీన ఒకే రోజు ఢిల్లీలో దాదాపు ముప్పై వేల కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా వేలాది కేసులు రావడంతో వందలాది మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.దీంతో శ్మశాన వాటికల్లో ఉద్యోగులు డే అండ్ నైట్ పని చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.అలా చేస్తున్నా కరోనా మృతుల చితి మంటలు అరడమేలేదు.ఏ శ్మశానవాటికలో చూసినా చితిమంటలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి.

వాస్తవాలకు దర్పణం పట్టిన ఉద్యోగి మాటలు!

తాజాగా ఢిల్లీలో ఒక శ్మశాన వాటిక ఉద్యోగి తమ కష్టాలను వివరించిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అతని ప్రత్యక్షానుభవాన్ని చూస్తే ఢిల్లీలో పరిస్థితి మీద ఒక అంచనా వేస్తోంది.ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ అనే శ్మశాన వాటిక ఉద్యోగి ఒకరిని ఒక మీడియా సంస్థ ఈ మధ్య ఇంటర్వ్యూ చేసింది.శ్మశాన వాటికల్లో పరిస్థితులు ఏమిటని ఆ ఉద్యోగిని ప్రశ్నించగా అతను చెప్పిన వివరాలు చూస్తే ఎవరైనా దిగ్భ్రాంతి చెందాల్సిందే!తమ శ్మశానవాటికలో రోజు లి కేవలం 31 చితులు మాత్రమే ఏర్పాటు చేసి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు ఉన్నాయని, కానీ ఇప్పుడు రోజుకు వంద మందికి నిరంతరాయంగా దహనక్రియలు నిర్వహిస్తున్నామని ఆ ఉద్యోగి చెప్పాడు.రోజంతా శ్మశానవాటిక పని చేస్తూనే ఉందని, ఇక్కడి ఉద్యోగులు సెలవులు సైతం లేకుండా పనిచేయాల్సి వస్తోందని ఆయన వాపోయాడు. కరోనా లేనప్పుడు రోజుకి ఆరు లేదా ఎనిమిది మృతదేహాలు ఈ శ్మశాన వాటికకువస్తే ఎక్కువని అతను వివరించాడు.ఇప్పుడు వంద దాకా వస్తున్నా నిరాటంకంగా పనిచేస్తున్న శవాల రాక మాత్రం ఆగడం లేదని అతను చెప్పాడు.

Read More: ICMR Guidelines: గాలి ద్వారా కరోనా వైరస్ ఎంత దూరం వ్యాపిస్తుందో తెలుసా?

మొదటిసారిగా భయం కలిగింది!

శ్మశాన వాటికలో పనిచేసే తనకు ఎప్పుడూ భయం కలగలేదని కాని ఇప్పుడు వస్తున్న మృతదేహాల రద్దీని చూశాక భయకంపితుడవుతున్నానని ఆ ఉద్యోగి చెప్పాడు.కరోనా మృతుల కుటుంబ సభ్యుల రోదనలు ,వారి కన్నీళ్లు ప్రత్యక్షంగా చూస్తున్న తనకు నిద్ర కూడా పట్టడం లేదన్నారు.ఎంత ఒత్తిడిలో ఉద్యోగం చేయలేక మానుకుందామనుకున్నా వృత్తి ధర్మం గుర్తుకొచ్చి ఆ పని చేయలేకున్నానని చెప్పాడు.శ్మశానంలో ఇంత పని చేసి ఇంటికెళ్లాక నిద్ర రావడం లేదని ,కుటుంబ సభ్యులతో కూడా అంటీముట్టనట్టుగా ఉండాల్సి వస్తోందని అతను వాపోయాడు.మరి ఇంకెన్నాళ్లు ఇలా కరోనా చితిమంటలు దేశంలో ఎగిసిపడతాయో అర్థమేకావడంలేదు.

 

author avatar
Yandamuri

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju