ఎన్ని కప్పులకు మించి గ్రీన్ టీ తాగకూడదో తెలుసా???

బరువు తగ్గడానికి అనగానే మనం ఎక్కువుగా వినే సూచన గ్రీన్ టీ తీసుకోవాలని. గ్రీన్ టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది అని అంటారు. కానీ దాని ప్రభావం మన శరీరం మీద ఎంత వరకు ఉంటుంది అనేది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.

ఎన్ని కప్పులకు మించి గ్రీన్ టీ తాగకూడదో తెలుసా???

అన్ని టీలలో కంటే గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు టాక్సిన్స్ మరియు ఫ్రీ రాడికల్స్ నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి. గ్రీన్ టీ శరీరం లోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉంచుతుంది.

ఒక రోజులో 3 కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే సమస్య ఏమి ఉండదు.  ఈ 3 కప్పుల గ్రీన్ టీ లో మొత్తం 240 నుండి 320 మిల్లీగ్రాముల పాలీఫెనాల్స్ ఉంటాయి. గ్రీన్ టీ సహజంగానే కెఫిన్ కలిగి ఉంటుంది. కాబట్టి ఎక్కువ గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

మీరు ఎక్కువ గ్రీన్ టీ తీసుకుంటున్నట్లు  అయితే చిరాకు  వస్తుంది. మీకు సరియైన నిద్ర కూడా పట్టదు. ఎక్కువ గ్రీన్ టీ ని సేవిస్తే విరేచనాలు లేదా మలబద్ధక సమస్యలు రావచ్చు. వీటితో పాటు వికారం లేదా చంచలమైన భావన వస్తుంది మీకు. ఈ లక్షణాలు అన్నీ శరీరంలో ఎక్కువ కెఫిన్ కంటెంట్ ఉంటే కనిపిస్తాయి.. ఇంకొన్ని సందర్భాల్లో గ్రీన్ టీ వల్ల అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి. ముఖంలో వాపుతో పాటు దురద, దద్దుర్లు కూడా ఏర్పడుతాయి. మీకు ఈ పైన  చెప్పబడిన లక్షణాలలో ఏవి కనపడినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.