NewsOrbit
న్యూస్

Mega Fans: “మెగా” అభిమానుల సత్తా ఎంత..!?జగన్ ని దించగలరా..!?

Mega Fans: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి పూర్తిగా పని చేయాలని.. పవన్ కల్యాణ్ ని సీఎం చేయడమే లక్ష్యంగా అందరూ కలిసి పని చేయాలనీ చిరంజీవి అభిమానుల సంఘం పేర్కొంది.. ఈ మేరకు నిన్న విజయవాడలో మెగా అభిమానులు సమావేశం జరిగింది.. వచ్చే ఎన్నికల్లో వ్యవహరించాల్సిన ప్రణాళికలు.. ఇటీవల చిరంజీవితో సీఎం జగన్ వ్యవహరించిన తీరుతో పాటూ కీలక అంశాలపై మాట్లాడారు.. అయితే ఈ సమావేశంలో చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసిన అభిమానులు మెగా ఫామిలీ నుండి వచ్చిన మరో టాప్ హీరో అల్లు అర్జున్ ని ఏ మాత్రం పట్టించుకోలేదు.. అతని ఫోటో, అతని తండ్రి అరవింద్ ఫోటో కూడా వేయలేదు.. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పడూ రకరకాల చర్చలు మొదలయ్యాయి..!

How much is the power of mega fans ..!?
How much is the power of mega fans

అభిమానుల శక్తి ఎంత..!?

చిరంజీవికి లక్షల్లో అభిమానులు ఉన్నారు.. చిరంజీవి తో పాటూ పవన్ కళ్యాణ్ కూడా కూడా అదనపు అభిమానులున్నారు. సో.. ఈ రెండు అభిమాన శక్తులు కలిస్తే బలమైన వాదన ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు.. కానీ.. నిలకడే ఇక్కడ ప్రధాన సమస్య.. చిరంజీవి అభిమాని అయినంత మాత్రానా రాజకీయంగా చిరంజీవి, లేదా పవన్ కళ్యాణ్ కి ఓటేయలని లేదు. సినిమాల పరంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ నచ్చిన వాళ్లకి రాజకీయంగా జగన్ లేదా చంద్రబాబు నచ్చోచ్చు.! సో.. ఇది ప్రాక్టీకల్ గా ఆలోచిస్తే చిరు, పవన్ అభిమానుల రాజకీయ శక్తిపై ఇప్పటికీ అనేక అనుమానాలే ఉన్నాయి..!

* ఉదాహరణకు.. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రం మొత్తం మీద “గాజువాక” నియోజకవర్గంలో భారీగా నమోదయ్యారు. దాదాపు 94 వేల సభ్యత్వాలు నమోదయ్యాయి.. కానీ అక్కడ జనసేన అధినేత పోటీ చేస్తే వచ్చిన ఓట్లు మాత్రం 52 వేలు మాత్రమే.. సో.. బయట చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ వేరు, రాజకీయంగా ఓట్లు విషయానికి వచ్చే సరికి వాస్తవాలు వేరు.. అంచేత కేవలం అభిమానులు తలచుకుంటే పవన్ సీఎం అయిపోతారన్న వాదన పక్కన పెట్టి.. కొంత మేరకు సాయశక్తులా ప్రయత్నాలు చేయవచ్చు..!

చిరంజీవికి చెప్పే చేస్తున్నారా..!?

ఈ అభిమానుల మీటింగ్.. రాజకీయ కార్యాచరణ మొత్తం చిరంజీవికి తెలిసి జరుగుతుందా..!? లేదా ఆయనకు సంబంధం లేకుండానే జరుగుతుందా..? అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అంశమే.. చిరంజీవి జగన్ తో రాజకీయ శత్రుత్వం కోరుకోవడం లేదు. తన పని ఏదో చేసుకుపోతో.. ప్రభుత్వంతో సానుకూలంగా ఉంటున్నారు.. పైగా.. సమయం, సందర్భం లేకపోయినా జగన్ పాలనను పొగడడానికి వెనుకాడడం లేదు.. జగన్ కి అత్యంత సన్నిహితుడు, తాజాగా రాజ్యసభ సీటుకి వెళ్లిన నిరంజన్ రెడ్డితో సినిమా కూడా తీశారు.. అంచేత చిరంజీవి జగన్ తో కయ్యాలు కోరుకోవడం లేదు. బహుశా ఈ అభిమానులే వారి అజెండా మేరకు పవన్ జెండా మోయడానికి సిద్ధపడి ఉండవచ్చు.. “ఆచార్య సినిమా రిలీజ్ ముందు చిరంజీవి .. సీఎం జగన్ ని కలిసినప్పుడు.. జగన్ వ్యవహరించిన తీరు బాలేదు.. జగన్ తిరిగి నమస్కరించలేదు..” ఆ ఘటన చూసిన మాకు తలలు తీసేసినట్టు అయింది అంటూ అభిమాన సంఘం నేత వ్యాఖ్యానించారు. కానీ.. ఆ విషయం మీద అప్పుడేం మాట్లాడలేదు.. అంటే చిరంజీవికి సంబంధం లేకుండా.. ఈ సంఘలన్ని జగన్ కి వ్యతిరేకంగా రాజకీయంగా చేయాలనీ నిర్ణయించుకోవడం వెనుక.. పవన్ కళ్యాణ్ రాజకీయ పావులు ఉండి ఉండవచ్చు.. తెరవెనుక జనసేన పొలిటికల్ ప్లాన్ ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..!

How much is the power of mega fans ..!?
How much is the power of mega fans

అల్లు అర్జున్ ని దూరం పెడితే..!?

మెగా ఫ్యామిలిలో చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరి తర్వాత రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్ కె ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. కానీ.. నిన్న జరిగిన మీటింగ్ లో చిరు అభిమానులు అల్లు ఫ్యామిలీని కలుపుకునే ప్రయత్నం చేయలేదు. అల్లు అర్జున్ ని దూరం పెడితే ఫాన్స్ లో చీలిక వచ్చే ప్రమాదం ఉంది. ఇది సీరియస్ గా పరిగణించాల్సిన అంశమే.. త్వరలోనే.. విశాఖ సహా తిరుపతి, ఇతర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.. సో.. ఈ మీటింగుల వెనుక జనసేన పొలిటికల్ ప్లాన్స్ ఉన్నాయనేది పక్కాగా అర్ధం చేసుకోవచ్చు.. మరి ఈ మీటింగులు, చర్చలపై చిరంజీవి ఏమైనా నోరు విప్పుతారా..!? సైలెంట్ గానే ఉంటారా..!? అనేది చూడాల్సి ఉంది.

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju