Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఆ ఇద్దరి కంటెస్టెంట్స్ కి నాగ్ చుక్కలు చూపించనున్నారా..??

Share

Bigg Boss 5 Telugu: యాంకర్ లోబో.. ఫిదా సంవత్సరాల తన లవర్ రమాదేవి అని పేర్కొన్నారు. ఇక తమ జంట తర్వాత ఇంట్లో మానస్… ప్రియాంక లవ్ స్టోరీ హైలెట్ అని తెలిపాడు. హౌస్ లో ఎవరెవరు.. జంటలుగా ఉంటే బాగుంటుంది అన్నదానిపై బీబీ.. న్యూస్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇందులో రిపోర్టర్లు గా.. రవి కాజల్ వ్యవహరించారు. టాస్క్ మొదలుకాగానే కాజల్ రవి.. తమదైన శైలిలో రెచ్చిపోయారు. ఈ క్రమంలో కాజల్ పెళ్లి అవ్వకముందు ఎవరెవరికి సైట్ కొట్టారు అని ప్రశ్నించడంతో తెలివిగా ఆమె పేరు చెప్పాడు. ఆ తర్వాత కాజల్ అంత సీన్ లేదులే అని నవ్వేసింది. ఈ క్రమంలో వీరిద్దరూ రిపోర్టర్లు..యానీ మాస్టార్ ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా.. శ్వేతా తనకి పెద్ద కూతురు లాంటిది అని యానీ చెప్పుకొచ్చింది. పనిలో పనిగా శ్రీరామ్, హమీదా , సన్నీ లమధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ అయినట్లు కొత్త విషయాన్ని బయట పెట్టింది.

అనంతరం శ్రీ రామచంద్ర లవ్ గురించి మాట్లాడుతూ… ఫస్ట్ వీక్ లో సిరి, హమిదా, తర్వాత లహరి.. ఇప్పుడైతే ప్రియా మీద లవ్ స్టార్ట్ అయిందని చెప్పుకొచ్చాడు. ఇక ఇంట్లో ఉన్న వారిలో భార్యగా, గర్ల్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, పని మనిషి ఎవరు సెట్ అవుతారు.. అనే ప్రశ్నలు వేయడం జరిగింది. దేనికి శ్రీరామ్ ఏమాత్రం తడుముకోకుండా లహరి, ప్రియ భార్యగా, సిరి, హమీదా గర్ల్‌ఫ్రెండ్స్‌గా, శ్వేత బెస్ట్‌ ఫ్రెండ్‌గా, కాజల్‌ పని మనిషిగా ఉంటే బాగుంటుందని టపీమని చెప్పాడు. దీంతో యాంకర్‌ రవి.. శ్రీరామచంద్ర ఇంటి పనిమనిషిగా కాజల్‌ వస్తే బాగుంటుందన్నాడంటూ హౌస్ లో రచ్చ రచ్చ చేశాడు. దీంతో కాజల్‌ ముఖం వాడిపోయింది. మానస్‌.. సిరి బెస్ట్‌ఫ్రెండ్‌, ప్రియాంక మరదలు, హమీదా ప్రేయసి, లహరి భార్య అయితే బాగుంటుందన్నాడు. సన్నీ.. శ్వేతను భార్యగా, హమీదాను గర్ల్‌ఫ్రెండ్‌గా, సిరిని పనిమనిషిగా సెలక్ట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత జెస్సీ.. సిరిని గర్ల్‌ఫ్రెండ్‌గా, కాజల్‌ను పని మనిషిగా ఎంచుకున్నాడు. మొత్తానికి అందరూ కలిసి కాజల్‌ను పనిమనిషిని చేశారు.

Bigg Boss Telugu 5: Sweta Varma gets trolled for slapping Hamida with color after an emotional speech on 'humanity and respect' - Times of India

 

హమీదా తో… శ్రీరామ్ డాన్స్..

ఇక శ్రీరామచంద్ర, షణ్ముఖ్‌లలో ఎవరిని సెలక్ట్‌ చేసుకుంటావన్న ప్రశ్నకు హమీదా వెంటనే శ్రీరామ్‌ అని ఒక్క ముక్కలో చెప్పేసింది. అనంతరం హమీదా తో… శ్రీరామ్ డాన్స్ వేయడం జరిగింది. ఓవరాల్ ఎపిసోడ్లో న్యూస్ రిపోర్టర్ గా ఉన్న కాజల్ కి.. ఇంటిలో ఉన్న సభ్యులు చాలామంది పనిమనిషిగా ఏంచుకోవటం హైలెట్ అయ్యింది. ఏది ఏమైనా ఇంట్లో ఉన్న సభ్యులు అంతా కాజల్ .. హౌస్ లో అడుగుపెట్టిన ప్రారంభంలో తనకి వంట పని రాదని.. అంటూలు కూడా తోమలేను.. అన్ని వ్యాఖ్యలు చేయటం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అర్థమవుతుంది.

Bigg Boss Telugu s5: Episode 4: Uma Devi's Silly Fight Over 'Aloo Curry'

 

ఉమాదేవి ఉగ్ర రూపం హౌస్ లో  దారుణమైన బూతులు తిట్టడం

కచ్చితంగా రాబోయే రోజుల్లో కాజల్ కి.. పెద్ద గండమే వంటగది విషయంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈవారం చాలావరకు హౌస్ లో … భయంకరంగా గొడవలు చోటుచేసుకున్నాయి. ఇంటిలో అందరి కంటే పెద్ద ఉమాదేవి దారుణమైన బూతులు తిట్టడం తో యాంకర్ నాగార్జున.. ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారు అనేది… సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది. అదేవిధంగా ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ టైంలో శ్వేత.. దారుణంగా రంగుని ముఖాలపై కోట్టడం.. పట్ల కూడా నాగ్ ఏమంటారో అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు.


Share

Related posts

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి

Siva Prasad

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ విషయంలో బాబు సరికొత్త ఎత్తుగడ..??

sekhar

బిగ్ బాస్ 4 : మోనాల్ ను అవమానించిన అఖిల్ ఫ్యామిలీ..? మరీ ఇలా చేస్తే ఎలా…?

arun kanna