రివేంజ్ తీర్చుకున్న రావ‌ణుడు.. ఎక్క‌డో తెలుసా..?

Share

న‌గులు పోయి తెగులు అవుతుంది అంటే నిజ‌మే అనిపిస్తుంది కొన్ని సంఘ‌ట‌న‌లు చూసిన‌ప్పుడు. స‌ర‌దా కోసం చేసే ప‌నుల్లో కొంద‌రూ కేర్ తీసుకోకుండా ప‌నులు చేస్తుంటారు. దానివ‌ల్ల ప్ర‌మాదం పొంచి ఉంటుందని కూడా ఆలోచించ‌రు. కేవ‌లం స‌ర‌దానే కావాలి ఇంకేంవ‌ద్ద‌ని మొండికి వేస్తుంటారు. అలా ఆ స‌ర‌దా కోసం చేసే ప‌నుల వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు అయ్యో.. అలా చేసి ఉండాల్సింది కాదు క‌దా అని న‌లుక‌ను క‌రుచుకుంటుంటారు. ఈ ప‌నుల వ‌ల్ల అబంశుభం తెలియ‌ని వారు కూడా స‌మ‌స్య‌ల్లో ఇరుకుంటుంటారు. అలాంటి విష‌యం గురించే ఇప్పుడు మీరు చ‌దివేది.

ద‌స‌రా పండ‌గ వ‌చ్చిందంటే ఆ హ‌డావిడే ఇంకోలా ఉంటుంది క‌దా.. మ‌న హ‌డావిడితో పాటు ప‌దిత‌ల‌ల రావ‌ణుడి ద‌హ‌నం కూడా చాలా స్పెష‌ల్ క‌దా.. ఆ స‌నివేశాల‌ను చూడ‌టానికి చాలా మంది వారి సొంతుళ్ల‌కు పోతుంటారు. రావ‌ణుడి ద‌హ‌నాన్ని నిర్వ‌హ‌కులు కూడా ఏటా కొత్త‌గా చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఒక ద‌గ్గ‌ర ఇలాగే ప్లాన్ చేశారు. ఇద్ద‌రు క‌ళాకారుల‌తో రాముడి వేషం కూడా వేయించారు. పెద్ద రావ‌ణుడి బొమ్మ‌కూడా రెడీ చేయించారు.

ఆ క‌ళాకారులు రావ‌ణుడిపై బాణాలు సందించే స‌మ‌యం రానే వ‌చ్చింది. ఇగ అంద‌రూ చూస్తుండ‌గానే బాణాల‌కు నిప్పు అంటింటి రావ‌ణుడిపైకి విసిరారు. అయితే ఆ బొమ్మ‌లో పేలుడు ప‌దార్థాల‌కు బ‌దులు తారాజువ్వ‌ల‌ను ఉంచిన విష‌యం అక్క‌డున్న వారికి ఈ క‌ళాకారుల‌కు తెలియ‌దు కాబోలు.. రావ‌ణుడు అంటుకోవ‌డంతో ఆ తారా జువ్వ‌లు అక్క‌డున్న వారిమీద‌కు దూసుకొచ్చాయి. దాంతో అంద‌రూ ప్రాణాల‌ను చేతుల్లో పెట్టుకుని ప‌రుగులు పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రావణుడు రివేంజ్ తీర్చుకున్నాడంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.


Share

Related posts

కవితా కి కౌంటర్ వేసిన బండ్ల గణేష్..!!

sekhar

టీడీపీ ఎమ్మెల్యే రూ. 300 కోట్ల భూ స్కామ్..!! వైసీపీలోకి ఎంట్రీ లేనట్టే..!?

Srinivas Manem

పవన్ ని బీజేపీ కంట్రోల్ చేసినట్లేనా..??

sekhar