పిల్లల చర్మం చాల మృదువుగా ఉంటుందికాబట్టి ప్రత్యేకంగా తయారు చేయబడిన ఆయిల్ని వాడతారు.. అయితే బేబీ ఆయిల్ ను పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దవాళ్లు కూడా వాడవచ్చు. ఇది చాలా మృదువైనది. పెద్దల కోసం తయారు చేసే కాస్మోటిక్స్ కంటే కూడా ఇది చాలా మంచిది. బేబీ ఆయిల్ వల్ల పెద్దవాళ్ళకి ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.
- బేబీ ఆయిల్ చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు, మేకప్ వల్ల చర్మానికి ఎటువంటి హాని కలగకుండా మేకప్ తొలగించవచ్చు. బేబీ ఆయిల్ ను ముఖానికి అంతా పట్టించిన తర్వాత ఒక పొడి టవల్ ను తీసుకొని మృదువు గా శుభ్రంగా తుడిచేసుకోవాలి.
- బేబీ ఆయిల్ కమిలిన చర్మానికి చాల మంచిది. ఉంగరాలు వేళ్ళకు బిగుసుకుపోయినప్పుడు కూడా ఈ బేబీ ఆయిల్ ను ఉపయోగించి తియ్యవచ్చు. ముఖానికి తేమ అందాలంటే ఈ నూనెని క్రమం తప్పకుండరాయడం మంచిది.
- చలి కాలం లో చర్మం పగిలినప్పుడు చాలామంది వేజిలైన్ రాస్తుంటారు. అలాంటి సమయంలో వేజిలైన్ అందుబాటులో లేకపోతే, ఈ ఆయిల్ సమర్ధవంతం గా పనిచేస్తుంది.
- కంటి కింద ఏర్పడిన నల్లటి గీతలను వలయాలు, బేబీ ఆయిల్ రాయడం వలన తొలగిపోతాయి.
- అప్పుడప్పుడు కాలి పాదం చర్మం పెళుసుగా మారుతుంటుంది. రాత్రి పడుకునే సమయం లో బాబీ ఆయిల్ రాస్తే ఉపశమనం ఉంటుంది .
- కొన్ని రకాల ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు కొంత మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దద్దుర్ల వంటివి వస్తుంటాయి . ఈ నూనె రాయడం వల్ల వాటిని తగ్గించుకోవచ్చు.
పొడిచర్మం ఉన్నవారికి దురద, దద్దుర్ల సమస్యల్ని కూడా బేబీ ఆయిల్తగ్గిస్తుంది. బేబీ ఆయిల్ బాత్ ఆయిల్ గా కూడా బాగా పనిచేస్తుంది. కొన్ని చుక్కల బేబీ ఆయిల్ ను స్నానం చేసే నీటి లో లేదా ఫెర్ఫ్యూమ్ లో కలిపి శరీరానికి స్ప్రే చేసుకోవడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటారు.