NewsOrbit
దైవం న్యూస్

Nagula chavithi 2022: నాగుల చవితి పండగను ఎలా జరుపుకోవాలి..?ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకోండి..!!

Nagula chavithi 2022: మన దేశంలో పాములను కూడా పూజించే సంప్రదాయం మన పూర్వికుల నుంచి ఆనవయితీగా వస్తుంది. ముఖ్యంగా నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తారు. ఇలా పాములను పూజించే పండగానే నాగులచవితి అని అంటారు.ఈ పండగను దీపావళి అమవాస్య తర్వాత వచ్చే కార్తిక శుద్ధ చవితి నాడు చేసుకుంటారు.దీన్నే నాగుల చవితి అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగకు ఎంతో ప్రాముక్యత ఉంది.ఈ నాగుల చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక జీవితంలో దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు.

ఈ చవితి ఈ రోజు భక్తులు పూజ చేసి పాములకు నైవేద్యాలను సమర్పిస్తారు.ఈ సందర్భంగా ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడొచ్చింది ? పూజ ఎలా చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..పురాణాల ప్రకారం, నాగుల చవితి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకు ఎన్నో దేవాలయాల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, శ్రీ మహా విష్ణుమూర్తికి ఆదిశేషుగా మారి తోడుగా ఉంటాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున నాగేంద్రునికి భక్తులందరూ ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పిస్తారు.

ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడంటే…?

Nagula chavithi festival

ఈ ఏడాది అక్టోబర్ మాసంలో 28వ తేదీన కార్తీక శుద్ధ చవితి రోజు అనగా శుక్రవారం రోజున నాగుల చవితి పండుగ వచ్చింది.తెలుగు పంచాంగం ప్రకారం, అక్టోబర్ 28వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4:18 గంటలకు చవితి తిథి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 29వ తేదీ శనివారం తెల్లవారుజామున 5:13 గంటలకు ముగుస్తుంది. శుభ సమయం మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 3:43 గంటల వరకు ఉంటుంది.నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే శ్రీమహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుల చవితి పండగ ఆంతర్యం.

నాగుల చవితి రోజు ఏమి చేయాలి?

Nagula chavithi

నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి ( నువ్వులతో చేస్తారు ) అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి పుట్ట దగ్గర పూజ చేసి దీపారాధన చేస్తారు. అలాగే పుట్టకు కాస్త దూరంలో” దీపావళి” నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులను కూడా కాలుస్తారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju