NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

How to Check MLC voter list in AP: ఏపీ ఎమ్మెల్సీ ఓటరు లిస్ట్ లో మీ పేరును ఆన్ లైన్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలంటే..?

How to Check MLC voter list in AP: ఆంధ్రప్రదేశ్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఎమ్మెల్సీ నియోజకవర్గం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఎమ్మెల్సీ నియోజకవర్గం,కడప, అనంతపురం, కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఏపి ఎన్నికల సీఇఓ) పట్టభద్రుల ఓటర్ జాబితాను విడుదల చేసింది. చాలా మంది తమ ఓటు నమోదు అయిందో లేదో తెలుసుకోవాలని అనుకుంటుంటారు. అటువంటి వారు ఓటరు లిస్ట్ తమ పేరు ఉందో లేదో ఈ విధంగా ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.

how to check mlc voter list in ap

 

ముందుగా బ్రౌజర్ లో అధికారిక ఓటరు సర్వీస్ పోర్టల్ వెబ్ సైట్ https://ceoaperolls.ap.gov.in/MLC_Graduate_LOcal_Authorities_Draft/Rolls లోకి వెళ్లాలి. అది ఓపెన్ అయిన తర్వాత మూడేసి జిల్లాలకు సంబంధించి నియోజకవర్గంలో ఒక దాన్ని సెలక్ట్ చేసి, ఆ పక్కనే మీ జిల్లాను ఎంచుకోవాలి. తర్వాత గెట్ పోలింగ్ స్టేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద పోలింగ్ స్టేషన్ నెంబర్, పోలింగ్ స్టేషన్ చిరుమానా వివరాలు వస్తాయి. మీరు గతంలో ఓటు వేసిన పోలింగ్ స్టేషన్ ప్రాంతాన్ని గుర్తించి దానికి ఎదురుగా ఉన్న రోల్ ను క్లిక్ చేయాలి. మీరు మొదటి సారి ఓపెన్ చేసినట్లు అయితే పోప్ అప్స్ బ్లాక్డ్ అని ఎర్రర్ మెసేజ్ వస్తుంది. మీరు దానిపై క్లిక్ చేసి ఆలోవ్స్ ఆల్ పొప్స్ ను ఎంచుకని డన్ పైన క్లిక్ చేయాలి. మొబైల్ లో కూడా ఈ విధంగానే వస్తుంది. అక్కడ కూడా ఇదే విదంగా చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత రోల్ అనే లింక్ పైన క్లిక్ చేయగానే వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయమని వస్తుంది. పైన ఉన్న వెరిఫికేషన్ కోడ్ యధావిధిగా ఎంటర్ చేసి సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

తరువాత పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని మీ పేరును సెర్చ్ చేసుకోవచ్చు. జాబితా మొత్తాన్ని వెతుక్కునే కన్నా కంట్రోల్ ఎఫ్ (ఫైండ్) ఆప్షన్ కు వెళ్లి మీ పేరును టైప్ చేసి పొందవచ్చు. ఇలా మీరు ఎమ్మెల్సీ ఓటరు లిస్ట్ ను డౌన్ లోడ్ చేసుకుని పేరును చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఓటరు ముసాయిదా జాబితాను పరిశీలించి అందులో మీ పేరులో తప్పులు ఉన్నా, మార్పులు చేర్పులు ఏమైనా చేయాలన్నా వెంటనే సమీపంలోని మీ ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లవచ్చు, లేకపోతే మరిన్ని వివరాలకు 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఉదయం 10 .30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ మీ వివరాలను తెలుసుకోవచ్చు.

YSRCP MLAs: జగన్ తర్వాత టార్గెట్ ఎమ్మెల్యేలు..!? వైసీపీలో అంతర్గత మార్పులపై..!

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk