23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
న్యూస్ హెల్త్

Cholesterol : చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పండ్ల గురించి మీకు తెలుసా..?

Share

ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ చెడు కొలెస్ట్రాల్ లో అధిక భాగం లివర్ లోనే ఉత్పత్తి అవుతుంది. కొలెస్ట్రాల్ పరిమితి దాటి ఉంటే రక్త నాళాల గోడలపై ప్రభావం పడుతుంది.అప్పుడు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో చెడు కోలేస్ట్రాల్ పేరుకుపోవడానికి గల ముఖ్య కారణం అధిక కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవడమె..ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నవి, స్వీట్లు, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే ఎల్ డీఎల్ పెరగొచ్చు.అలాగే శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల కూడ తిన్న ఆహారం సంపూర్ణంగా వినియోగం కాదు. అప్పుడు కూడా చెడు కొవ్వులు పెరుగుతాయి.

చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే..?

Bad cholesterol

అందుకే ఫైబర్ ఉండే ఆహారం తింటూ ఉండాలి. అలాగే శారీరక వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. హెచ్ డీఎల్ ఎంత ఎక్కువ ఉంటే అంత శరీరానికి మంచిది. అయితే రోజువారీ ఆహారంలో కొన్ని రకాల పండ్లను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే పండ్లలో ఉండే సొల్యూబుల్ అనే ఫైబర్ కొవ్వు పేరుకుపోనివ్వకుండా కాపాడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గించే పండ్లు :

Ftuits

మరి ఎలాంటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.. యాపిల్ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది.అలాగే. కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఇది ఎంతో సాయపడుతుంది. యాపిల్ లో ఉండే పాలీ ఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.అలాగే పియర్స్ పండ్లలో ఉండే సొల్యూబుల్ ఫైబర్ అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఇంకా బెర్రీల్లో కూడా ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది.కమలా మరియు నారింజ
పండ్లలో ఫైబర్, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి.ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.అలాగే ఆవకాడో కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.


Share

Related posts

శ్రీచక్ర ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

somaraju sharma

దగ్గుబాటి పురంధరేశ్వరి దశ తిరగబోతోందా?

siddhu

బ్రేకింగ్: పల్నాడులో టీడీపీ నేత దారుణ హత్య

somaraju sharma