NewsOrbit
న్యూస్

ఇతనిని నిలువరించేదెలా? జగన్ కు కొత్త తలనొప్పి !!

ఎవరికైనా టైమ్ రావాలంటారు టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కిఇప్పుడు ఆ టైం వచ్చినట్లు కనిపిస్తోంది.తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పట్టాభి టిడిపి అధికార ప్రతినిధిగా ఉన్నప్పటికీ అప్పట్లో లంకా దినకర్ అందరినీ డామినేట్ చేసే వారు.మదిలో కొన్నాళ్లు సాదినేని యామిని హల్చల్ చేశారు.చివరికి వీళ్లిద్దరూ బీజేపీలోకి వెళ్లిపోవడంతో పట్టాభి టిడిపికి మైకు గా మారారు.

 

అయితే ఆ పాత్రను పట్టాభి సమర్థంగా పోషిస్తున్నారు.వైసిపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్ కి పట్టాభి తలనొప్పిగా మారారు.నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి పాత్ర ఉన్న 108అంబులెన్స్ ల కుంభకోణాన్ని బయటపెట్టిన పట్టాభి తాజాగా ముఖ్యమంత్రి జగన్ సతీమణికి సంబంధించిన కంపెనీ సరస్వతి ఇండస్ట్రీసుకు సంబంధించిన స్కాముని వెలికితీశారు.
ఈ కుంభకోణం గురించి పట్టాభి వివరిస్తూ సరస్వతి ఇండస్ట్రీస్ లో వాటాలు ఉన్నాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే 2019 ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన సతీమణి శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు అనెక్జర్-2 లో తెలిపారు. 15.07.2008న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. అందులో డైరక్టర్ లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి, శ్రీమతి వైఎస్ విజయ గారు నాడు మీటింగ్ లో పాల్గొన్నారు. అప్పటి వరకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ బైలాస్ లో సిమెంట్ కర్మాగార ప్రస్తావన లేదు.”

“15.07.2008 న మీటింగ్ నిర్వహించి సిమెంట్ ఇండస్ట్రీస్ కూడా నిర్వహించేకునే విధంగా బైలాస్ లో సవరణ తీసుకొచ్చారు. కానీ 12.06.2008 న మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన మెమో ఆధారంగా సరస్వతి పవర్స్ ఇండస్ట్రీస్ కు గనులు కేటాయించినట్లు 18.05.2009న విడుదల చేసిన జీవో నెం.107 లో పేర్కొన్నారు. అంటే కంపెనీ బైలాస్ లో సిమెంట్ కంపెనీ ప్రస్తావన రాకముందే.. సిమెంట్ కంపెనీకి 613.70 హెక్టార్ల భూకేటాయింపులు జరిగిపోయాయి అన్నారు. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రెండేళ్ల తర్వాత కూడా ఎటువంటి అడుగులు పడకపోయేసరికి.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం షోకాజు నోటీసులు పంపి ఆ కంపెనీ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో
09.10.2014న అప్పటి ప్రభుత్వం మైనింగ్ లీజులు రద్దు చేస్తూ.. జీవో నెం.98 విడుదల చేసిందని మైనింగ్ లీజును రద్దు చేయడానికి గల కారణాలను కూడా ఆ జీవోలో అప్పటి ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని పట్టాభి చెప్పారు మైనింగ్ లీజులను పునరుద్ధించాలని కోరుతూ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ 06.11.2014న కోర్టును ఆశ్రయించిందని తెలిపారు.ఇదిలా ఉండగా ఈ కంపెనీకి 29.03.2012 నుంచి ఏడేళ్ల పాటు 29.03.2019 వరకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు వచ్చాయి. రోజుకు 2,855 ఎం.క్యూబ్ నీటిని మాత్రమే వినియోగించాలని కేంద్ర పర్యావరణ శాఖ కండిషన్స్ ను విధించింది. రోజుకు 2,855 ఎం.క్యూబ్ నీరు అంటే ఏడాదికి 0.0368 టీఎంసీల నీరు అవుతుంది. పర్యావరణ అనుమతుల కాలపరిమితి ముగియడటంతో.. రెన్యువల్ కు 19.02.2019న మరలా అప్లై చేశారు.ఆ సమయంలో సిమెంట్ కంపెనీ నిర్మించాలనుకుంటున్న స్థలానికి సంబంధించిన జీవో ఏమైనా పెండింగ్ లో ఉందా..? అని ఫాం.నెం.1 లోని 22 వ పాయింట్ లో ఉంటే లేదని రాశారు. జీవో నెం. 98 అమలులో ఉంటే లేదని ఎలా రాశారు..? పాయింట్ నెం.24లో కోర్టులలో లిటిగేషన్స్ ఏమన్నా పెండింగ్ లో ఉన్నాయా..? ఉంటే పిటిసన్ నెంబర్లు పేర్కొనమంటే ‘నన్’ అని రాశారని పట్టాభి వివరించారు

ఆ కంపెనీ యాజమాన్యం తొక్కిపెట్టిన వాస్తవాలు తెలియక కేంద్రం కూడా పర్యావరణ అనుమతులను మూడేళ్లు పొడిగిస్తూ.. 03.07.2019న ఆర్డర్ ఇచ్చింది.అనంతరం జీవో నెం.98 పై కంపెనీ వేసిన పిటిషన్ పై.. 15 అక్టోబర్,2019న కోర్టులో తుది విచారణ జరిగింది. అప్పటికే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సిన అడ్వకేట్ జనరల్ కూడా పూర్తిగా కంపెనీ లాయర్ చెప్పిన ప్రతీదానికి తలఊపడంతో.. కోర్టు జీవో నెం.98ను కొట్టివేసింది. ఇక్కడ కూడా మతలబు జరిగిందని ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కొంత సర్కారు భూములు నప్పటికీ ఆ విషయాన్ని కంపెనీ తొక్కిపెట్టిందని ఆయన చెప్పారు కోర్టు తీర్పు తర్వాత 12.12.2019న జీవో నెం.98ను కొట్టివేసి.. లీజులను రెన్యూవల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.109 విడుదల చేసింది.”

ఇక మైనింగ్ లీజులను రెన్యువల్ చేయడానికి 10 రోజుల ముందే ఇరిగేషన్ శాఖ మంత్రి 03.12.2019న కంపెనీకి 0.068 టీంఎంసీల నీటిని కేటాయించారు. పర్యావరణ అనుమతులలో 0.0368 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించాలనే నిబంధన ఉంటే.. దానికి రెట్టింపు నీటిని సరస్వతి ఇండస్ట్రీస్ కు మంత్రి కేటాయించారని పట్టాభి వెల్లడించారు చివరకు ముఖ్యమంత్రి ఒక నీటి దొంగలా కూడా మారారని అర్థమవుతోందని పట్టాభి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నీటి బండారాన్ని బయటపెడుతున్నాం. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ ఏం సమాధానం చెబుతారు..?అని పట్టాభి నిలదీశారు . నీటి కేటాయింపులను మొదటి ఐదేళ్లకు అని జీవోలో పేర్కొని.. తర్వాత జీవిత కాలానికి అని చెప్పి 15.05.2020న మరో జీవో నెం.16 విడుదల చేశారు. అంటే భవిష్యత్తులో కంపెనీ మూతపడితే నీరు అమ్ముకుని అయినా బ్రతికేద్దామనుకుంటున్నారా..?అని ఎద్దేవా చేశారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్నిటికీ సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు.పట్టాభి లేవనెత్తిన అంశాలు కీలకమైనవి కావడంతో జగన్ కూడా ఆలోచనలో పడ్డారన్నారు.అసలింతకీ ఇంత ముఖ్యమైన సమాచారం పట్టాభి కెలా చేరుతుందన్న విషయమై ఆరాతీస్తున్నారని కూడా అధికార వర్గాలు చెప్పాయి.మొత్తానికి పట్టాభి జగను కి పంటి కింద రాయిలా మారారని చెప్పాలి

author avatar
Yandamuri

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju