Chronic Illness: దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇంట్లో ఉంటే ఈ జీవిత సూత్రాలను పాటించాల్సిందే… (Part 2)

How to treat Chronic Illness patients
Share

Chronic Illness: మొదటి భాగంలో దీపాలి రైనా తన తండ్రిని పార్కిన్సన్స్ డిజార్డర్ వల్ల వచ్చే క్షోభ నుండి ఎలా బయటికి తీసుకుని వచ్చింది… అందుకు ఇంట్లో వారు ఎలా సహాయపడగలరు అన్నది వివరించడం జరిగింది. రెండవ అర్ధ భాగంలో మనం వారి చుట్టూ మనం కల్పించవలసిన వాతావరణం, ఆరోగ్య సమస్యలు అర్థం చేసుకొని వారిని బ్రతికినంత కాలం ఎంతో ఉత్తేజంగా ఎలా ఉంచాలన్న విషయంపై దృష్టి పెట్టడం జరిగింది…

 

How to treat Chronic Illness patients

పాజిటివ్ గా ఉంటూ… పరిసరాలనుండి ప్రేరణ పొందండి

జీవితంలో పాజిటివ్ గా ఉండడం ఒక ఛాయిస్. పరిస్థితులు ఎప్పుడూ మనల్ని వెనక్కినెట్టవచ్చు కానీ మనం ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించాలి. ఉదాహరణకు తండ్రి ఆరోగ్య సమస్యలతో ఇంట్లో బాధపడుతూ ఉంటే అమ్మ మాత్రం తన ముఖంపై చిరునవ్వు కోల్పోకుండా అందరూ బాగుండాలని ఆశీర్వదిస్తూ, దీవిస్తూ సంతోషంగా ఉంటుంది. మనం ఇంటిలోని వారి గురించి బాధపడుతున్నప్పుడు ఒకసారి అమ్మ ముఖాన్ని గుర్తు చేసుకుంటే చాలు ఎన్ని కష్టాలు ఉన్నా ఆమె నవ్వుతూ ఉంది అంటే నేను ఎందుకు నవ్వలేను అన్న ప్రేరణ ముందు మనం పొంది ఆ తర్వాత ఆరోగ్యం బాగా లేకుండా బాధపడుతున్న వారికి కూడా ఆ పాజిటివ్ యాంగిల్స్ చూపించాలి.

Chronic Illness: రాయడం అలవాటు చేసుకోవాలి

ఇది ఎక్కువ మందికి తెలియదు కానీ మన మనసులోని భావాలు పేపర్ పై రాయడం ద్వారా ఉన్న ఒత్తిడి అంతా తీరిపోతుంది. మనసు చాలా తేలిక అవుతుంది. “ఏదైనా మాట్లాడుతూ… అప్పుడప్పుడు మా నాన్న గారి విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నాను అని విపరీతమైన వేదనకు గురి అయ్యేదాన్ని. కొన్నిసార్లు నా నిస్సహాయత గురించి ఒక పేపర్ పై రాసినప్పుడు ఉన్న ఫలంగా ఎంతో బెటర్ గా ఫీల్ అయ్యాను,” అని దీపాలి చెప్పుకొచ్చింది.

చిన్న చిన్న విషయాల్లో కూడా కామెడీ యాంగిల్ చూడండి

మనం పరిస్థితిని కంట్రోల్ చేయలేము కానీ ఆ పరిస్థితికి మనమిచ్చే రియాక్షన్ ను మాత్రం కంట్రోల్ చేయవచ్చు. దీపాలి ఎప్పుడైతే నాన్న గారి ఆరోగ్యం మరి బాగా లేకుండా వస్తుందో అప్పుడు తీవ్రమైన దిగులుకిలోనయ్యారు. కానీ ఇంట్లో వాతావరణం బాగా సందడిగా ఉంచడం చిన్న చిన్న విషయాల్లో కూడా నవ్వు తెప్పించే అంశాలను గుర్తించి వాళ్లతో పంచుకోవడం వంటివి అతని ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఎంతో తోడ్పడ్డాయి.

మన మానసిక స్థితి సరిగ్గా ఉంచుకోవాలి

ఎల్లప్పుడూ ఆరోగ్యం బాగా లేని వారి వద్ద ఉంటే మన మానసిక స్థితి కూడా చెడిపోతుంది. కాబట్టి ఒక గంట మనం వారి నుంచి దూరంగా ఉండి వాకింగ్, వ్యాయామం లేదా మన శరీరం రీఛార్జ్ అయ్యే ఏదో ఒక పని చేయాలి. అలా మనం కూడా తర్వాత వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రెష్ మైండ్ తో వెళ్తాము.

అవతలి వారి గురించి పట్టించుకోకు

మన ఇంట్లో ఒక వ్యక్తి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు మనం ఎన్నో పనులు చేయలేకపోవచ్చు. అసైన్మెంట్లు టైం కి అందించలేం… ఫంక్షన్ కి లేట్ గా అటెండ్ అవుతాము… ఇలా ఎన్నో విషయాల్లో మన జీవితం మారిపోతుంది. అయితే అవతలి వారు మన పరిస్థితి అర్థం చేసుకోకుండా వారి మానాన వారు ప్రశ్నలు అడుగుతుంటే ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వకండి. అసలు వారి ఉద్దేశం ఏమిటో పట్టించుకోకుండా మన పని మనం చూసుకోవడం మంచిది.

మన కూడా ఉండే వారి నుండే బలం పొందాలి

మన మనసుకి దగ్గరగా ఉన్న వ్యక్తి అలా మంచాన పడితే మనం ఎంతో కృంగిపోతారు. మానసికంగా చాలా బలహీనంగా తయారవుతాం. కాబట్టి మన చుట్టూ ఉండేది ఒకరిద్దరు ఫ్రెండ్స్ అయినా కూడా వారి నుండి బలం పొందేందుకు ప్రయత్నించండి. వారు ఎప్పటికీ మనకి సంకల్పం ఇస్తూ మనతోపాటు మన బాధలు పంచుకుంటూ ఉండే వారితో ఎక్కువ సమయం గడపండి.

కొత్తగా ఆలోచించండి

దీపాలి రైనా గతకొద్ది సంవత్సరాలలో గమనించింది ఏమిటంటే… ప్రతి రోజు ఆమె తనకు తానుగా కొత్త వర్షెన్ లోకి మారిపోతుందట. కాబట్టి ఎంతో దృఢంగా ఉంటూ విన్నూతం గా ఆలోచించడం మొదలు పెట్టింది. ప్రతిరోజు ఆరోగ్యం బాగా లేకుండా బాధపడుతున్నవారికి కొత్త అనుభూతిని అందించేందుకు తాపత్రయ పడుతూ ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చింది. అలా ఆమెకు కొన్ని చిన్న చిన్న విజయాలు కూడా లభించాయి. అవే మనకు ఇంకా ముందుకు వెళ్లేందుకు బలాన్నిస్తాయి అని చెప్తుంది దీపాలి.

Chronic Illness: ముందుగానే కృంగిపోకూడదు

మనం పుట్టినప్పటి నుంచి మనతో ఉన్న మనిషి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా చెడిపోయి… వారు అలా నిస్సహాయ స్థితిలో ఉండి మన సహాయం కోరుతూ ఉంటే ఆదిలోనే మనం  కృంగిపోతే ఎటువంటి ఫలితం ఉండదు. దానివల్ల మనం తిరిగి కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది… అది చాలా కష్టసాధ్యమైన విషయం కూడా. కాబట్టి వారికి సహాయం అందించడానికి మనకు చేతనైన పని చేస్తూ వీలైనంత సమయం వారితో గడుపుతూ ముందు నుండి పాజిటివ్ గా ఉంటేనే ఒకానొక సమయంలో మనం వారు పరిస్థితిని అర్థం చేసుకుని అంగీకరిస్తాము.


Share

Related posts

కరోనా వాక్సిన్ పై మోడీ స్వయం సమీక్ష

somaraju sharma

బ్రేకింగ్: ఇకపై రేషన్ కార్డులే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు

Vihari

Vishakapatanam : విశాఖ విషయంలో ఏపీకి మరో టోపీ పెడుతున్న కేంద్రం..??

sekhar