Chronic Illness: దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ జీవిత సూత్రాలను పాటించాల్సిందే… (Part 1)

How to treat patients with Chronic Illness
Share

Chronic Illness: మన చిన్నప్పుడు ఇంట్లో వారు రోజుకి ఐదు పది కిలోమీటర్ల నడుస్తూ… చల్లటి నీటితో ఉదయాన్నే స్నానం చేస్తూ… వాతావరణం ఎలా ఉన్నా ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా ఆరోగ్యంగా ఉండటం చూస్తూ పెరిగాం. అలాంటి వారే మనం యుక్తవయస్సుకు లేదా మధ్య వయసు కు వచ్చినప్పుడు పదేళ్ళ చిన్న పిల్లల్లాగా మారిపోతుంటారు. రోజుకి డబ్బా నిండుగా టాబ్లెట్లు తీసుకుంటూ… తిండి కంటే మందులను ఎక్కువగా తింటుంటారు. అలా తన తండ్రికి వచ్చిన పార్కిన్సన్స్ కండీషన్ ద్వారా తను నేర్చుకున్న విషయాలను ప్రస్తావించారు రచయిత్రి దీపాలి రైనా.

 

How to treat patients with Chronic Illness

ఆరేళ్ల క్రితం దీపాలి నాన్నకు ఆరోగ్యం బాగాలేకుండా వచ్చినప్పుడు పలువురు డాక్టర్లను సంప్రదించారు. ప్రతి ఒక్కరూ వీలైనన్ని టెస్టులు చేసి తమ సొంత మందులు ఇచ్చి వాడమన్నారు. అయితే వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక చివరికి తేలిందేమిటంటే దీపాలి తండ్రి గారికి పార్కిన్సన్స్ అనే ఒక శరీరాన్ని క్షీణింపజేసే ఆరోగ్య పరిస్థితి వచ్చింది అని. ఇక అప్పటి నుంచి అతని జీవితం అగమ్యగోచరంగా మారింది. అయితే వారి నాన్నతో ఉన్న అనుభవాలు అతని పరిస్థితి చూసిన దీపాలి ఈ సమస్యతో బాధపడే కోలుకోవాలంటే ఎలా ఉండాలో 15 సూత్రాలను చెప్పుకొచ్చారు.

1. ఆరోగ్యం బాగా లేని వారి ఆరోగ్య స్థితిని గుర్తించి అర్థం చేసుకోవాలి

మనం ప్రేమించే వారికి ఆరోగ్యం బాగాలేదు అన్న విషయాన్ని ముందు మనం అంగీకరించాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటూ పేషెంట్ ను ఎలా ట్రీట్ చేయాలి…? అతనితో ఎలా మెలగాలి…? ఈ రోగం కి అవతల వారి మానసిక స్థితి ఎలా ఉండాలి అన్న విషయం పై పూర్తి అవగాహన పెంచుకోవాలి.

2. ఇంట్లో ప్రతి ఒక్కరూ పనిని పంచుకోవాలి

ఇంట్లో ఒక్కరే పని భారం మొత్తం భుజాలపైన వేసుకోకుండా అందరూ తలా ఒక పని చేయాలి. అప్పుడు ఆరోగ్యం బాగా లేని వ్యక్తి కూడా మనసు తేలికగా ఉంటుంది. ఒకరు అన్నం తినిపించడం, మరొకరు ఫిజియోథెరపీ చేయించడం లేదా వాకింగ్ కు తీసుకొని వెళ్ళడం వంటివి చేస్తూ నలుగురు అతనికి సహాయపడుతూ ఉండాలి. ఎప్పుడు ఒకరే అతని ఆలనా పాలన చూస్తుంటే వారికి కూడా బోర్ కొడుతుంది. ఇలా చేయడం వల్ల మానసిక దృక్పథం పెరిగి వారు త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

3. ఈరోజు జీవించేందుకు మొదటి రోజు లేదా ఆఖరి రోజు అని అనుకోవాలి

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనుక్షణం వారి రోగంతో పోరాడుతూనే ఉంటారు. రాబోయే క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు… వారికీ తెలియదు కాబట్టి రోజు వారి చివరి రోజు లాగానే భావిస్తూ వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిరోజు వీలైనంత సమయం వారితో ముచ్చటిస్తుంటే వారు ఎంతో ఉత్తేజభరితులు అవుతారు. మన రచయిత దీపాలి అయితే ఆమె తండ్రికి షుగర్ ఉన్నప్పటికీ అతని స్వీట్లు అంటే ఇష్టం కాబట్టి ప్రతిరోజు కొద్ది సీట్లు ఇచ్చి ఆయనను తృప్తిపరిచేవారట.

Chronic Illness:

4. అతిగా ఆలోచించకూడదు

అసలు మన వారికి ఈ పరిస్థితి ఎలా వచ్చింది అన్న ఆలోచన ముందు మెదడు నుంచి తీసేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని దానిని అంగీకరించాలి. కానీ ఇక దీనిని ఎలా తప్పించాలి… అసలు ఈ తప్పు ఎక్కడ జరిగింది అన్న విషయం గురించి ఆలోచించి ఏమాత్రం ప్రయోజనం లేదు.

5. వారిని చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి 

పైన చెప్పినట్లు పార్కిన్సన్స్ లాంటి వ్యాధుల విషయంలో రోగుల్లో మూడ్ స్వింగ్ ఎక్కువగా అవుతుంటాయి. వారు తమ భావాలను వ్యక్తపరిచలేరు. చిన్న పిల్లలాగా మారం చేస్తూ విసిగిస్తూ ఉంటాను అయితే ఓపిక చేసుకొని వారి మాటలను అర్థం చేసుకొని మొత్తం విని సమాధానం చెప్పాలి.

6. మనసుకు హాయిగా అనిపించే మాటలు మాట్లాడాలి

వారి చిన్నప్పటి గురించి అలాగే ఇంట్లో వారందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్న విషయాలు, సందర్భాల గురించి తరచుగా చర్చిస్తూ ఉండడం ఎంతో మంచిది. దీపాలి… వారందరూ కలిసి కాశ్మీర్ వెళ్ళిన రోజులను గుర్తు చేయడం అలాగే తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం అలాంటి చేసినప్పుడు ఆమె తండ్రి ఎంతో బాగా స్పందించాడు అని చెప్పుకొచ్చింది.

7. చుట్టూ నలుగురు ఉండేలా వాతావరణం క్రియేట్ చేయాలి

దీపాలి తండ్రిగారికి రేడియో పెట్టి వినిపిస్తూ ఉన్నారు. టీవీ చూపించారు. ఓటిటిలో సినిమాలు చూపించారు. అయితే ఏదీ ఆయనకి పెద్దగా స్పందన తీసుకొని రాలేదు. అయితే చివరికి నలుగురు ఉండే పేకాట సరదా ఆడినప్పుడు ఆయన ఎంతో ఎంజాయ్ చేశారు. అలాగే అతను నచ్చే పాత సినిమాలు పెట్టడం నలుగురు ఒకచోట నుండి మాట్లాడుకుంటున్నప్పుడు, ఆర్తి, భజన వంటి చోట్ల ఆయన మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉందట.


Share

Related posts

తక్కువే కాదు అవి ఎక్కువ తీసుకున్న డేంజరే.. ఎందుకో తెలుసా?

Teja

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చిన బీజేపీ, బీఎల్ఎఫ్

Siva Prasad

తన గర్ల్ ఫ్రెండ్స్ కోసం చిటికెలో మేకప్ వేసుకునే టెక్నిక్స్ చెప్పిన శ్రీముఖి?

Varun G