Vikram veda : ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ కి సంబంధించి అధికారక ప్రకటన వచ్చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్నారు. ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాను మిగతా భాషల్లో రీమేక్ చేయడం అన్నది ఎప్పటి నుంచో వస్తున్నదే. అయితే అన్నీ భాషల్లో రీమేక్ సినిమాలు హిట్ సాధిస్తాయన్న గ్యారెంటీ లేదు. కానీ మేకర్స్ మాత్రం ఆయా భాషలకి తగ్గట్టు కథలో కీలక మార్పులు చేసి స్టార్స్ ని పెట్టి తీస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తమిళ బ్లాక్ బస్టర్ సినిమా ‘విక్రమ్ వేద’ను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా తెలుగు, హిందీ రీమేక్‌ల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.
అయితే ఇంకా తెలుగులో దీని రీమేక్ లో ఎవరు నటిస్తారన్నది వెల్లడి కాలేదు. కానీ తాజాగా హిందీ రీమేక్ లో హృతిక్ రోషన్- సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్టు వెల్లడైంది. ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన పుష్కర్ గాయత్రి హిందీ రీమేక్ ని తెరకెక్కించబోతున్నారు. త్వరలో ఈ మూవీని మేకర్స్ సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ ని 2022 సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి మేకర్స్ డేట్ కూడా లాక్ చేసి ప్రకటించారు. ఇక ఇందులో మిగతా నటీ నటులు..ఇతర టెక్నీషియన్స్ వివరాలు వెల్లడించనున్నారు.
Vikram veda : గ్యాంగ్ స్టర్ పాత్రలో హృతిక్ రోషన్, పోలీస్ ఆఫీసర్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించనున్నారు.
తమిళ వర్షన్ లో విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి – సీనియర్ హీరో ఆర్.మాధవన్ ముఖ్య పాత్రలలో నటించారు. 2017లో విడుదలై భారీ హిట్ గా నిలిచింది. గ్యాంగ్ స్టర్ – పోలీస్ ఆఫీసర్ మధ్య నడిచే ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ ‘విక్రమ్’ పాత్రలో మాధవన్, గ్యాంగ్ స్టర్ ‘వేద’ పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఇక హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సంచలన విజయం సాధించింది. ఇక తాజాగా రూపొందనున్న హిందీ రీమేక్ లో గ్యాంగ్ స్టర్ పాత్రలో హృతిక్ రోషన్, పోలీస్ ఆఫీసర్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించనున్నారు.