NewsOrbit
జాతీయం న్యూస్

కారులో భారీగా నోట్ల కట్టలు .. బెంగాల్ పోలీసుల అదుపులోకి ముగ్గురు ఎమ్మెల్యేలు

Share

భారీ మొత్తం నగదుతో కారులో వెళుతున్న జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పశ్చిమ బెంగాల్‌ లోని హౌరా ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జమ్తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ, ఖిజ్రీ ఎమ్మెల్యే రాజేష్ కచ్చప్, కొలెబిరా ఎమ్మెల్యే నమన్ బిక్సాల్‌లు టయోటా ఫార్య్యూనర్ కారులో వెళుతుండగా పంచల గ్రామ సమీపంలో పోలీసులు నిలుపుదల చేసి కారును తనిఖీ చేశారు. కారు డిక్కీలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హౌరా రూరల్ ఎస్పీ స్వాతి భంగాలియా ఈ విషయంపై మాట్లాడుతూ భారీగా డబ్బులు తరలిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఈ కారును ఆపి తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు. పట్టుబడిన నగదు ఎంత అనేది లెక్కించేందుకు నోట్లు లెక్కించే యంత్రాలను ఉపయోగించాల్సి ఉందని తెలిపారు. నోట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

 

బెంగాల్ లో ఉపాద్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో మాజీ మంత్రి పార్ధా చటర్జీ సన్నిహితురాలు అర్బితా ముఖర్జీ నివాసాల్లో ఈడీ అధికారుుల జరిపిన సోదాలో 50 కోట్లకు పైగా నగదు, భారీ మొత్తంలో నగలు దొరికిన కొద్ది రోజుల వ్యవధిలోనే తాజా ఘటన వెలుగుచూడటం రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. అర్పితా ముఖర్జీ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, నగలు దొరికిన నేపథ్యంలో పార్దా చటర్జీ, అర్బితా ముఖర్జీలను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ కేసు నేపథ్యంలో పార్దా చటర్జీని సీఎం మమతా బెనర్జీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేశారు. ఇప్పుడు జార్ఘండ్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల నుండి పోలీసులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ లేదా ఈడీ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందని అంటున్నారు.


Share

Related posts

Today Gold Rate: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!!

bharani jella

Pattabhi: పట్టాభి అవే వ్యాఖ్యలు రాయలసీమలో చేస్తే అంటూ వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Panchayat polls : ఏపిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

somaraju sharma