Insect: సాధారణంగా చిన్న చిన్న ప్రాణులని కీటకాలు అని పిలుస్తూ ఉంటాం. కానీ అదే కీటకం ఏకంగా మనిషి చెయ్యంత పెద్దదిగా ఉంటే? ఇటువంటి కీటకాలు మనకి ఎక్కువగా ఆస్ట్రేలియా లో కనిపిస్తాయి. అందుకు కారణం అక్కడి భూమి ఎక్కువగా చెట్లతో నిది ఉండడం. ఆస్ట్రేలియా అనగానే మనకి ముందుగా గుర్తువచ్చే జంతువు కంగారు. నిజానికి ఆస్ట్రేలియా లో మనుషుల కన్నా జంతువుల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రేలియా లో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. ఇక అక్కడ ఉండే అడవుల వలన పాముల సంఖ్య అత్యధికంగా ఉంటుంది.
ఇటీవల పామ్ టైలర్ అనే ఆస్ట్రేలియన్ మహిళ తన కుటుంబంతో కలిసి క్యాంపుకు వెళ్లాలనుకుంది. అనుకున్నదే తడవుగా బ్రిస్బేన్‌లోని ఓ అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. అక్కడకు చేరుకున్నాక ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలో ఆమెకు అక్కడ ఓ చెట్టు మీద ఓ భారీ కీటకం కనిపించింది. అది చుసిన ఆమె వెంటనే భయంతో పరుగులు తీసింది. ఆమె తన కుటుంబ సభ్యులతో మళ్ళి వచ్చి మనిషి చెయ్యి సైజు లో ఉన్న ఆ కీటకం ను ఫోటో తీసి ఫేస్‌బుక్‌లోని ప్రముఖ ‘అమెచ్యూర్ ఎంటమాలజీ ఆస్ట్రేలియా’ పేజ్‌లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియా లో ఈ ఫొటోలు చూసిన కొందరు అది ‘వుడ్ మాత్’ అయ్యి ఉండవచ్చని కామెంట్ చేసారు.
ఈ వుడ్ మాత్ బూడిద రంగులో ఉంటుంది. అలాగే ఈ కీటకాలు సుమారు 15 నుంచి 25 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అంతేకాకుండా ఈ కీటకాల శరీరంపై చిన్న చిన్న మచ్చలు కూడా ఉంటాయి. ఈ వుడ్ మాత్ ఆస్ట్రేలియాలోని తీర ప్రాంతాలలోనే కనిపిస్తుందని ముఖ్యంగా వేసవి కాలంలో ఈ కీటకాలు ఎక్కువగా కనిపిస్తాయని అంటున్నారు ఆస్ట్రేలియన్లు.