Thaman: పాన్ ఇండియన్ స్టార్‌తో పనిచేసే అవకాశం గతంలో ఓసారి మిస్సాయానని ఇటీవల మ్యూజిక్ సెన్షేషన్ థమన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ప్రస్తుతం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా సాలీడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న థమన్ ఎలాగైన ప్రభాస్‌తో పనిచేసే అవకాశం దక్కించుకుంటానని చాలా నమ్మకంగా మాట్లాడాడు. అయితే, ఆ అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించి ఉండడు. ప్రస్తుతం ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా ‘రాధే శ్యామ్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసుకొని సంక్రాంతి బరిలో దిగేందుకు ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘రాధే శ్యామ్’ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేసేందుకు థమన్‌ను తీసుకోవాలని యూవీ వారు భావిస్తున్నారట. ఈ మధ్య కాలంలో థమన్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు విపరీతంగా పేరొస్తోంది. ‘భీమ్లా నాయక్’ సాంగ్స్, టీజర్లకు ఇచ్చిన బీజీఎం, ఇటీవల విడుదలైన ‘అఖండ’ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందుకు ఉదాహరణ. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమా సూపర్ హిట్‌కు థమన్ ఎలా ప్రధాన కారణం అయ్యాడో ఇప్పుడు ‘అఖండ’ హిట్‌కు థమన్ ముఖ్య కారణం అయ్యాడు.
Thaman: బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించే బాధ్యత థమన్‌కు..!
అదే ఇప్పుడు ‘రాధే శ్యామ్’ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించే అవకాశం తెచ్చిపెట్టినట్టు సమాచారం. ఈ సినిమా హిందీ వెర్షన్ సాంగ్స్ కోసం మిథూన్- అర్మాన్ మాలిక్- అర్జీత్ సింగ్- మనన్ భరద్వాజ్ లను సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. తెలుగు సహా మిగతా భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకుడు. కానీ, ఓవరాల్‌గా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించే బాధ్యత మాత్రం థమన్‌కు అప్పగించే ఆలోచనలో ఉన్నారట. దీనిపై త్వరలో ఓ క్లారిటీ రానుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!