NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గ్రేటర్ ఎన్నికలకు పోలీసుల ఏర్పాట్లు అద్దిరిపోయాయ్…! చిన్న గొడవ జరిగినా….

డిసెంబర్ ఒకటో తేదీ జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కు సంబంధించిన ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కామెంట్స్ చేశారు. ఎన్నికల కోసం 22 వేల మంది పోలీసులతో అన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా పోలీసు సిబ్బందికి నాలుగుసార్లు తర్ఫీదు ఇచ్చినట్లు చెప్పారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూచనల ప్రకారం అన్ని ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఇందులో కేంద్ర, రాష్ట్ర బలగాలు కలిసి ఉన్నాయని తెలిపారు.

 

నార్మల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద సిఐ స్థాయి అధికారి నేతృత్వంలో పోలీస్ శాఖ పని చేస్తుందని అన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని… హైపర్ సిస్నిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద 66 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇక పోతే హైదరాబాద్ కమిషనరేట్ లో 29 వార్డులు ఉన్నాయి. 4976 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2016 తో పోలిస్తే 817 కొత్త పోలింగ్ స్టేషన్ లు కొత్తగా ఏర్పాటు చేశారు. నార్మల్ పోలింగ్ స్టేషన్ లు 2146 కాగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు 1517. 167 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. 406 మొబైల్ పార్టీ లతో నిరంతరం మానిటరింగ్ చేస్తారని అంజనీ కుమార్ తెలిపారు.

హైదరాబాద్ లో మొత్తం 29 బార్డర్ చెక్ పోస్ట్ లు ఉండగా…. హైపర్ సెన్సిటివ్ ఏరియా ల్లో 293 పికెట్ లు ఏర్పాటు చేసారు. 4187 గన్స్ ను నేతలు డిపాజిట్ చేశారు. 3066 మంది రౌడీ షీటర్ లు బైండోవర్ అయ్యారు. 1.45 కోట్ల రూపాయల నగదుని స్వాధీనం చేసుకోగా…. మత్తు పదార్థాలు , మద్యం అన్ని కలిపి 10 లక్షలు విలువ చేసే పదార్థాలు కూడా సీజ్ చేశారు. 63 ఫిర్యాదులు, 55 ఎఫ్ ఐ అర్ లు నమోదు చేశారు పోలీసు శాఖ వారు.

ప్రతి పోల్ల్లింగ్ స్టేషన్ కు జియో ట్యాగింగ్ తో పాటు సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా. పెండింగ్ లో ఉన్న 49 నాన్ బెయిబుల్ వారెంట్ జారీ చేశారు. ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా భద్రత కట్టుదిట్టం. జియో ట్యాగింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని అనుసంధానం. 4లక్షల సీసీ కెమెరాలు రోజంతా మానిటరింగ్ చేస్తారు అలాగే…,డిసిపి, ఏసిపి ఆఫీస్ లో రౌండ్ ధ క్లాక్ పర్యవేక్షన పెట్టాము. ఎన్నికల అనంతరం లైవ్ స్ట్రీమింగ్, స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రత్యేక నిఘా.

ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం. ఓటర్ లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆయ పార్టీల నేతలు, బయట నుండి వచ్చిన వారు హైదరాబాద్ నుండి వెళ్లిపోవాలి. ఎన్నికల గైడ్ లైన్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఎలక్షన్ ఆజెంట్ కి ప్రత్యేక వాహనం అనుమతి వుండదు. ఓటర్ లు 200 మీటర్ ల వద్ద తమ వాహనాలు పార్క్ చేయాలి. ఓటర్ లను తరలించడం చట్ట విరుద్ధం అల చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని కమీషనర్ అంజనీ కుమార్ వివరించారు.

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!