Tollywood: అనుకోవడానికి భారీ ప్రాజెక్ట్స్..కానీ అడుగే ముందుకు పడలేదు..!

Share

Tollywood: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ సహా మిగతా సౌత్ భాషా సినిమాలను కొన్నిటిని అనౌన్స్ చేయడం తప్ప అవి ఎందుకనో కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోలేకపోయాయి. ఇలాంటి కాంబినేషన్స్‌లో గనక  సినిమాలు వస్తే రికార్డుల సంగతేమో గానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోవడానికి మాత్రం గొప్పగానే ఉండేది. హీరోల డేట్స్ కుదరకనా, లేక దర్శక, రచయితలు కథ సిద్ధం చేయలేకపోవడం వల్లనా తెలీదు గానీ బాలీవుడ్‌ను మించిన కాంబినేషన్‌లో సినిమా అనుకొని మొదలు పెట్టలేకపోయారు.

Huge projects to think about..but did not go ahead
Huge projects to think about..but did not go ahead

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఇప్పటికే జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాత వాసి సినిమాలు వచ్చాయి. వీటిలో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. అజ్ఞాత వాసి మాత్రం అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. అయితే వీరి కాంబినేషన్‌లో కోబలి అనే సినిమా తెరకెక్కాల్సి ఉంది. టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఎందుకనో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్ట్ తర్వాత అనుకున్నవి సినిమాలుగా వచ్చాయి.

Tollywood: పూరి జగన్నాధ్ దర్శకుడిగా మారింది మొదట పవన్ కళ్యాణ్ సినిమాతోనే.

పూరి జగన్నాధ్ దర్శకుడిగా మారింది మొదట పవన్ కళ్యాణ్ సినిమాతోనే. బద్రి వీరి కాంబినేషన్‌లో వచ్చి భారీ హిట్ సాధించింది. ఆ తర్వాత కెమెరా మేన్ గంగతో రాంబాబు వచ్చింది. అయితే కొన్ని కాంట్రవర్సీల వల్ల ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే రవితేజకంటే ఎక్కువ సినిమాలు పూరి కాంబినేషన్‌లో వచ్చేవి. పోకిరి, ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి కూడా పవన్ కళ్యాణ్, పూరి కాంబినేషన్‌లో రావాల్సింది. వస్తే ఆ రికార్డ్ వేరే లేవల్. కాగా పూరి జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన మహేశ్ బాబుతో చేయాలనుకున్నాడు.

కానీ గతకొంతకాలంగా ఆ స్క్రిప్ట్‌ను పవన్ కళ్యాణ్‌తో చేసేందుకు పూరి ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కూడా మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ మెగా ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పట్టాలెక్కిస్తాడని అనుకున్నారు. ఇది మొదలై ప్రాజెక్ట్ వచ్చి ఉంటే మాత్రం నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా సినిమా చరిత్రలో నిలిచిపోయేది. కానీ ఇది అంత సులభంగా మొదలయ్యే సినిమా కాదని ఇంతకంటే చెప్పడానికి ఉదాహరణ అక్కర్లేదు.

Tollywood: ఈ సినిమాలో అమితాబ్ ఓ కీలక పాత్ర పోషించాల్సి ఉంది.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రైతు అనే సినిమా రావాల్సింది. అంతేకాదు అన్నీ కుదిరితే ఇదే బాలయ్య 100 వ సినిమాగా వచ్చేది. కానీ ఈ మూవీ పట్టాలెక్కలేదు. అందుకు కారణం బిగ్ బి అమితాబ్ బచ్చన్ అని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో అమితాబ్ ఓ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. మేకర్స్ ఆయనతోనే చేయించాలనుకున్నారు. కానీ అమితాబ్ ఎందుకో ఈ మూవీపై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అంతకముందు నాగార్జున మనంలో నటించిన బిగ్ బి..ఆ తర్వాత ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీకి డేట్స్ ఇచ్చారు. మధ్యలో మెగాస్టార్ సైరా మూవీ చేశారు. కాని బాలయ్య సినిమాకి మాత్రం నో రెస్పాన్స్. ఇలాంటి కారణాల వల్ల కొన్ని గొప్ప ప్రాజెక్ట్స్ మొదలవడం లేదు.


Share

Related posts

Prabhas : ప్రభాస్ ‘ సలార్ ‘ సెకండ్ షెడ్యూల్ ని రామోజీఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్..!

GRK

కలియుగంలో జరిగేవి ఇవే !

Sree matha

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఏడాది పాలన ఎలా ఉంది ?- ప్రజాభిప్రాయ సేకరణ

ramu T