న్యూస్ సినిమా

KGF 2 కి రిలీజ్ ముందే భారీ దెబ్బ!!

KGF 2 కి రిలీజ్ ముందే భారీ దెబ్బ!!
Share

ప్రస్తుతం ఇండియా లోని సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కే‌జి‌ఎఫ్ చాప్టర్ -2”. ఇప్పటికే ఈ సినిమా పై తార స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్ ను ఈ చిత్ర బృందం హీరో యష్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయాలనుకుని అనుకోకుండా ఒక రోజు ముందే రిలీజ్ చేసింది.

KGF 2 కి రిలీజ్ ముందే భారీ దెబ్బ!!

టీజర్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ ఐదు రోజులు అయినప్పటికి రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ప్రస్తుతానికి ఈ టీజర్ కు 145 మిలియన్ల వ్యూస్ తో పాటుగా 7 మిలియన్స్ లైక్స్ వచ్చాయి. అయితే, తాజాగా ఈ సినిమాకు ఎవరు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. విడుదలైన టీజర్ ను బట్టి కర్ణాటక ఆరోగ్య శాఖ వారు ఈ సినిమా  నుండి  కొన్ని సన్నవేశాలు తొలగించాలని నోటీసులు జారీ చేశారు. ఈ సినిమాలో ముఖ్యంగా హీరో యష్ పోగ త్రాగుతున్న అన్ని సన్నివేశాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, దీనికి సంబంధించి ఈ సినిమా హీరో, రాకింగ్ స్టార్ యష్‌కు మరియు చిత్ర సిబ్బందికి నోటీసులను కూడా జారీ చేసింది.

ఆరోగ్య శాఖ, టొబాకో 2003 చట్టంలోని సెక్షన్ 5 నిబంధనల ప్రకారం సినిమాలలో పోగ త్రాగే సన్నవేశాలు ఉండకూదని, అలాగే వాటిని తొలగించకపోతే ఈ చట్టాన్ని అతిక్రమించనట్లేనని స్పష్టంగా తెలియజేసింది. మన దేశంలోని యువత ఇటువంటి సన్నివేశాల వలన పెడదోవ పట్టే అవకాశాలు ఉన్నందున ఈ సినిమా నుంచి హీరో పొగత్రాగే అన్ని సన్నివేశాలను తొలగించాలని తెలపింది.  యువత సినిమాల్లో తమ అభిమాన హీరోలు పొగ తాగడం చూసి వారు కూడా పొగ త్రాగి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య శాఖ పెర్కొంది. దీనికి సంబంధించి ఈ చిత్రబృందం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.


Share

Related posts

Bharatha Sindhuri: తెలుగు మహిళా ఐఏఎస్ కు అరుదైన గౌరవం!”భారత సింధూరి” పేరిట బయోపిక్ !!

Yandamuri

Shyam Singharoy: షూటింగ్ పూర్తి చేసుకున్న శ్యామ్ సింగరాయ్.. నాని న్యూలుక్ వైరల్..!!

bharani jella

కరోనా నేర్పిన కొత్త పాఠం.. కొత్త పాకం..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar