ఓటుకు తప్పని తిప్పలు

Share

అమరావతి, ఏప్రిల్ 10: తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు ఇక్కడకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ప్రజలు ఆర్‌టిసి, ప్రైవేటు బస్సులు, ట్రైన్‌లు, సొంత కార్లలో బయలు దేరారు. ఒక్క సారిగా హైదరాబాదు నుండి ఎక్కువ సంఖ్యలో కార్లు బయలుదేరడంతో జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాల వద్ద గంటల తరబడి వాహనాలు బారులు తీరుతున్నాయి. కిలో మీటరు నుండి రెండు కిలో మీటర్ల వరకూ వాహనాలు నిలిచిపోతున్నాయి.

మరో పక్క కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ఒక్క సారిగా 125 బస్సులను రద్దు చేయడంతో ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ఆంధ్ర ప్రాంత ఓటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరో ప్రైవేటు ట్రావెల్స్ కూడా పది బస్సులను రద్దు చేసింది. అనివార్య కారణాల వల్ల బస్సులు నడపలేకపోతున్నామనీ, డబ్బులు వాపస్ చేస్తామంటూ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణీకులకు మెసేజ్‌లు పెట్టినట్లు సమాచారం. ముందుగా రిజర్వేషన్‌లు చేసుకున్న సుమారు ఐదారు వేల మంది ప్రయాణీకులు ఇప్పుడు ఆంధ్రాకు ఎలా చేరుకోవాలన్నదానిపై తర్జన భర్జన పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రాంత ఓటర్ల కోసం హైదరాబాదు నుండి ఆంధ్ర ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఎపిఎస్ ఆర్‌టిసి చర్యలు చేపట్టింది. మరో పక్క హైదరాబాదు ఎంజిబిఎస్ బస్టాండ్, రైల్వే స్టేషన్, విజయవాడ బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రయాణీకులతో రద్దీగా మారింది.


Share

Related posts

8 రోజుల త‌రువాత కూడా కోవిడ్ ల‌క్ష‌ణాలు బ‌యట ప‌డ‌తాయి.. సైంటిస్టుల వెల్ల‌డి..!

Srikanth A

“ఆదిపురుష్” బడ్జెట్ లెక్కలు టోటల్ ఇదిగో .. దీనిముందు బాహుబలి జూజూబి…!!

sekhar

Big Breaking : పురపాలక ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం..ఇద్దరు డిప్యూటి మేయర్లు, ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నికకు గ్రీన్ సిగ్నల్

somaraju sharma

Leave a Comment