Hungry: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి తిండి తినట్లేదు.. ఖచ్చితంగా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం కి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.. అలా ఈ రోజుల్లో ఎవ్వరూ పాటించడం లేదు.. ఎప్పుడూ ఆకలి వేస్తే అప్పుడు అందుబాటులో ఏదుంటే అవి తినేస్తూ ఉంటున్నారు.. ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.. కొన్ని కొన్ని సార్లు మనకే తెలియకుండా విపరీతంగా ఆకలి వేస్తుంది.. అటువంటి సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి..!! ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Hungry: ఆకలిగా ఉన్నప్పుడు అందరూ చేసే పొరపాట్లు ఇవే..!!
కొన్ని కొన్ని సార్లు విపరీతంగా ఆకలి వేస్తుంది అటువంటి సమయంలో చాలామంది బిస్కెట్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇవి మరలా ఓ పది నిమిషాలకు ఆకలి వేస్తుంది. మరికొంతమంది. ఇది ఆకలి వేసినప్పుడు వెంటనే మ్యాగీ లేదా నూడుల్స్ తింటూ ఉంటారు. ఆరోగ్యం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.. బాగా ఆకలిగా అనిపించినప్పుడు ప్రోటీన్ బార్స్, వేపర్స్, చాక్లెట్స్, స్వీట్లు తింటూ ఉంటారు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు పంచదార తో తయారుచేసిన నా పదార్థాలు తీసుకోవడం వలన శరీరానికి హాని కలిగిస్తుంది. పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది.
ఇవి తిన్న కాసేపటి తరువాత వికారంగా అనిపిస్తుంది. ఆహారం తిన్న తర్వాత ఆకలి వేసినప్పుడు చాలా మంది నూనెలో వేయించిన చిరుతిళ్లు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఇవి తినడం వలన ఎసిడిటీ సమస్య వస్తుంది. కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఇవి తిన్న నాలుగు గంటల వరకు ఏమి తినాలని అనిపించదు. ఆకలిగా ఉన్నప్పుడు చేతికి దొరికింది ఏదో ఒకటి తినేస్తాను. ఆ తరువాత కడుపు సంబంధిత సమస్యలతో మళ్లీ మనమే బాధ పడతాము. అటువంటప్పుడు ఏం చేయాలంటే..
Hungry: ఆకలిగా ఉన్నప్పుడు ఇవి తినండి..!!
బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక ఆపిల్ పండు తినండి. ఆపిల్ తో పీనట్ బటర్ కలిపి తీసుకోవాలి. 3 ఎండు ఖర్జూరాలు, 6 బాదం పప్పు కలిపి తీసుకుంటే ఆకలి తగ్గించడం తో పాటు కడుపు నిండుగా ఉంటుంది. స్వీట్స్ తినే బదులు నట్స్ తినండి. ఇలాంటి టైం లో ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే చాలా బాగుంటుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?