Tadepalligudem (west Godavari): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో విడిపోయి పుట్టినింట్లో ఉంటున్న భార్యను నమ్మించి తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసిన ప్రభుద్దుడి ఉదంతమిది. గ్రామానికి చెందిన గంజి దావీదు మద్యానికి బానిసగా మారడంతో అతని భార్య నిర్మల తన ముగ్గురు పుట్టింట్లో ఉంచి ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భార్య తనకు డబ్బులు పంపడం లేదంటూ తరచు ఇద్దరు కుమార్తెలను చిత్రహింసలు పెట్టాడు. కుమార్తెలను చిత్ర హింసలు పెడుతూ దావీడు తన కుమారుడితో మొబైల్ లో వీడియో తీయించి కువైట్ లోని భార్యకు పంపాడు.

ఆ వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ గా మారడంత తాడేపల్లి రూరల్ పోలీసులు దావీదును అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత నిర్మల కూడా కువైట్ నుండి వచ్చేసి పుట్టింట్లో ఉంటోంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. దావీదు రెండు నెలల క్రితం జైలు నుండి బెయిల్ పై విడుదల అయ్యాడు. మూడు రోజుల క్రితం దావీదు భార్య వద్దకు వచ్చి తాను మరిపోయాననీ, మంచిగా చూసుకుంటానని నమ్మబలికి వీరపాలెంలోని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్య భర్తల మధ్య మళ్లీ గొడవ అయ్యింది.
దీంతో శుక్రవారం వేకుమజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో భార్య నిర్మలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిర్మల మెడ, చేయి కోసి, తలను రెండు ముక్కలుగా చేసి సైకోగా ప్రవర్తించాడు. హతురాలి చేయిని నరికి ఆమె మరో చేతిలో పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ బండారు శ్రీనాథ్, తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
మహా సీఎం శిండేకి సుప్రీం కోర్టులో షాక్