NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Huzurabad By Election: హరీష్ వ్యాఖ్యలపై ఈటల స్ట్రాంగ్ కౌంటర్ ఇదీ.. కోఠి చౌరస్తాలో ఉరితీయాలంటూ సవాల్..

Huzurabad By Election: హూజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. నిన్నటి వరకూ కలిసి తిరిగిన స్నేహితులే ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యర్ధులుగా మారి విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇటీవల కాలం వరకూ మంత్రి పదవులతో కలసి మెలసి ఉన్న ఈటల రాజేందర్, మంత్రి హరీష్ రావు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, హరీష్ రావు కు సవాల్ విసిరారు.

Huzurabad By Election: Eatela rajender comments on Harish Rao
Huzurabad By Election Eatela rajender comments on Harish Rao

Huzurabad By Election: ఆయన ఇంకా అవమానాలు భరిస్తున్నాడు

హరీష్ రావుకు తనకు మధ్య 18 సంవత్సరాల అనుబంధం ఉందని పేర్కొన్న ఈటెల.. మరో సారి హరీష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కూడా తనతో పాటు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడనీ, కానీ ఇంకా ఆయన భరిస్తున్నారనీ, తాను భరించలేకే బయటకు వచ్చానని మరో సారి పేర్కొన్నారు. ఏదో ఒక రోజు టీఆర్ఎస్ కు అధిపతి అవుతానని హరీష్ పగటి కలలు కంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన విధానాలతో టీఆర్ఎస్ కనుమరుగు అవుతుందనీ, ఈ విషయం హరీష్ రావు బాగా తెలుసునని ఈటెల అన్నారు.

ఇలాంటి విమర్శలకు హరీష్ రావు దూరమేననీ, కానీ పార్టీ  బాధ్యతలు అప్పగించగానే అన్నీ మరచిపోయి తనపై విమర్శలు చేస్తున్నారని ఈటల అన్నారు. మామ (కేసిఆర్) మెప్పు కోసమే హరీష్ రావు తనపై ఆరోపణలు చేస్తున్నారనీ, తన గురించి హరీష్ రావుకు బాగా తెలుసునన్నారు. ఇటీవల ఈటెలను ఉద్దేశించి హూజూరాబాద్ లో రెండు గుంటలు ఉన్న వ్యక్తికి, రెండు వందల ఎకరాలు ఉన్న వ్యక్తి మధ్య పోటీ ఇది అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఈటెల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తప్పు చేసినట్లు రుజువైతే కోటి చౌరస్తాలో ఉరి తీయండి

200 ఎకరాల తనకు ఇప్పుడే ఉన్నాయా అని ప్రశ్నించారు ఈటెల. 2001 లో టీఆర్ఎస్ పార్టీలో చేరే నాటికే తనకు భూములు ఉన్నాయని పేర్కొన్నారు. 2002 సమయంలో తన ఆస్తులు, 2021 లో అస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాను తప్పు చేసినట్లు రుజువు అయితే హైదరాబాద్ కోటి చౌరస్తాలో ఉరి తీయమని సవాల్ విసిరారు. అలాగే వాళ్ల అస్తులపైనా విచారణ జరిపించాలని ఈటెల డిమాండ్ చేశారు. హరీష్ రావుకీ పౌల్ట్రీ ఫామ్ ఉందన్న ఈటెల ఆయనకు ఒకటి ఉంటే తనకు పది పౌల్ట్రీ ఫామ్ లు ఉన్నాయన్నారు. రాజకీయాల్లోకి రాకముందే తనకు పౌల్ట్రీ ఫామ్ లు ఉన్న విషయాన్ని ఈటెల గుర్తు చేశారు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N