కరోనా వైరస్ ఎలాగైనా ఒకరి నుండి మరొకరికి అంటుకుంటోంది. మనం సాధారణంగా చేసే కొన్ని పనులు కూడా ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందడానికి కారకాలు అవుతున్నాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.
హైదరాబాద్ లో ఒక కానిస్టేబుల్ తనకు కొడుకు పుట్టాడన్న ఆనందంలో తన బంధువులకు, శ్రేయోభిలాషులకు స్వీట్లు పంచాడు. ఇప్పుడు అదే 12 మందికి కరోనా వ్యాప్తి చెందడానికి కారణమైంది. వనస్థలిపురం ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా ప్రకటించేలా చేసాయి. వివరాల్లోకి వెళితే కానిస్టేబుల్ సోదరుడికి కరోనా పాజిటివ్ కావడంతో అతని నుండి అందరికీ స్వీట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందింది. అందుకే సంతోషకర సంఘటన అయినా సరే తోటివాళ్లతో జరుపుకోవడానికి ఒకసారి ఆలోచించుకోవాల్సిందే.