ఈ టీవీ జబర్దస్త్ ప్రోగ్రాం తో స్టార్ అయిన హైపర్ అది త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లి తెరపై ఒక సక్సస్పుల్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. అయితే అటు జబర్దస్త్ షో లో కొనసాగుతూనే అది పలు షో లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే, హైపర్ ఆది త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడని సమాచారం. ఆది పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తన స్వంత జిల్లా అయిన ప్రకాశం జిల్లా కు చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. అది సన్నిహితులు చెబుతున్న సమాచారం బట్టి ఇది పెద్దలు కుదిర్చిన వివాహమట.
హైపర్ ఆది తన పెళ్ళి విషయంలో మొండిగా వ్యవహరిస్తూ పట్టుదలతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆది వాళ్ళ ఇంట్లో ఎప్పటినుంచో సంబంధాలు చూస్తున్నారని కానీ ఆది నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో వారు ఇన్నాళ్లు లేట్ చేశారని ఆది స్నేహితులు చెబుతున్నారు. అయితే చివరికి ఆది తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్దపడ్డాడట.
స్క్రిప్ట్ రైటర్ నుంచి అంచలంచలుగా ఎదిగి టీమ్ లీడర్ స్థాయికి చేరుకున్నాడు హైపర్ ఆది. ఈ ప్రయాణంలో తన కంటూ ఒక రేంజ్ క్రియేట్ చేసుకున్నాడు హైపర్ ఆది. కేవలం బుల్లితెర మీదే కాకుండా ఆది వెండితెర మీద కూడా కనిపించి ప్రేక్షకుల మన్నన పొందాడు. ఇప్పటి వరకు తను నటించిన సినిమాల్లో కామెడీ పరంగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు ఆది.