హైపర్ ఆది.. ప్రస్తుతం జబర్దస్త్ కు ఒక కుడి భుజం లాంటి టీమ్ లీడర్. ఆయన స్కిట్ లేకపోతే.. జబర్దస్త్ ను చూసే వాళ్ల సంఖ్య సగానికి సగం తగ్గుతుంది. నిజం చెప్పాలంటే.. హైపర్ ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ చూసేవాళ్లు కోకొల్లలు. అంత డిమాండ్ ఉంది ప్రస్తుతం హైపర్ ఆది స్కిట్ కు. ఆది స్కిట్ మొత్తం.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ పంచ్ లే ఉంటాయి. ఒక పంచ్ కి నవ్వే లోపే మరో పంచ్ పేలుతుంది. మొత్తం మీద పొట్ట చెక్కలు కావాల్సిందే.

ఆయన స్కిట్ కు అంత డిమాండ్ ఉంది కాబట్టే… హైపర్ ఆదికి ఎక్కువ వేతనం ఇచ్చి మరీ మల్లెమాల వాళ్లు హైపర్ ఆదితో స్కిట్లు చేయిస్తున్నారు. సరే.. ఇదంతా ఓకే కానీ.. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది.. జబర్దస్త్ షోపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
స్కిట్ లో భాగంగా.. జబర్దస్త్ పై సూపర్ పంచ్ వేశారు. తన స్కిట్ లో కంటెస్టెంట్ మా ఎంట్రీ ఎలా ఉంది అని అడగగా.. ఒరేయ్.. నువ్వు ఈ ఎంట్రీకే ఇలా అంటే.. మేము కింది నుంచి .. పైనుంచి.. 360 డిగ్రీలల్లో ఎంట్రీ ఇచ్చాం. కానీ.. ఏం చేయలేకపోయాం. అందుకే ఇప్పుడు నార్మల్ గా వస్తున్నాం.. అంటూ హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేయడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది.. అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు.
నిజానికి.. హైపర్ ఆదికి జబర్దస్త్ లో బాగానే ప్రియారిటీ ఇస్తారు. కానీ.. తనకు ఎందుకు ఇంత వైరాగ్యం కలిగింది.. అంత మాట ఎందుకు అనేశాడు.. అనేదే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. సరె సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా? ఏంటి.. ముందు ఈ ప్రోమో అయితే చూసేయండి..