హైపర్ ఆది.. జబర్దస్త్ లో టాప్ కమెడియన్. ఆయనకు ఉన్నంత డిమాండ్ మరే కంటెస్టెంట్ కు లేదు. కానీ… ఈ మధ్య హైపర్ ఆది స్కిట్లు చూసేవాళ్లకు వచ్చే ఒకే ఒక చిరాకు… ఆయన టీమ్ లో పనిచేసే దొరబాబు, పరదేశి మీద వేసే కుళ్లు జోకులు. ఒకసారి వేస్తే ఓకే.. రెండు సార్లు వేసినా ఓకే కానీ.. ప్రతి స్కిట్ లో వాళ్లనే టార్గెట్ చేస్తూ.. వాళ్లేదో తప్పు చేస్తూ దొరికిపోయారని.. దాన్ని పట్టుకొని కామెడీ చేయాలని చూస్తున్న హైపర్ ఆదిని చూసి జనాలు నవ్వుకుంటున్నారు.

హైపర్ ఆదికి ఇంతకు మించి ఎక్కువ కామెడీ చేయడం రాదా? కామెడీ అంటే ఇదేనా? ఒకరు ఏదో తప్పు చేసి దొరికినంత మాత్రాన.. దాన్ని అలుసుగా తీసుకొని కామెడీ చేస్తారా? అది కూడా ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు. పంచ్ లు వేయడానికి మీకు ఇబ్బంది లేకపోవచ్చు కానీ.. అదేదో ఘనకార్యం అయినట్టుగా దాని మీద ప్రతిసారి కుళ్లు జోకులు వేయడం.. దానికి జడ్జిలు పగలబడి నవ్వడం. ఏందిది.. మాకేందీ ఖర్మ.. అంటూ జబర్దస్త్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ హైపర్ ఆది కుళ్లు జోకులపై జోకులు పేలుతున్నాయి.
నిజానికి… దొరబాబు, పరదేశి ఇద్దరూ ఏదో రాకెట్ లో పోలీసులకు దొరికారట. పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారట. తర్వాత మమ్మల్ని వదిలేయాలంటూ.. ఇద్దరూ పోలీసుల కాళ్లు పట్టుకున్నారట. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది. కట్ చేస్తే ఆ సంఘటన జరిగి ఆరు నెలలు దాటిపోయినా.. అప్పటి నుంచి అదే సంఘటనను పట్టుకొని.. దానిపై చెత్త కామెడీ ట్రాక్ ను కంటిన్యూగా హైపర్ ఆది నడిపిస్తుండటం ప్రేక్షకులకు చెడ్డ చిరాకు తెప్పిస్తోంది.
ఇకనైనా ఫ్రెష్ కామెడీని… ఎంచుకొని ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తే మంచిది.. లేదంటే… హైపర్ ఆది ఇంతే అని చెప్పి.. ఆ కుళ్లు.. ప్రస్టేషన్ జోకులను చూడటమే మానేస్తారు జనాలు.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలోనూ అదే కుళ్లు కామెడీని చూడొచ్చు..