NewsOrbit
న్యూస్

Hyundai: తీవ్ర దుమారం రేపిన హ్యూందాయ్ ‘కశ్మీర్’ ట్వీట్..కొరియా రాయబారికి కేంద్రం సమన్లు..  

Hyundai: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హ్యూందాయ్ కు చెందిన పాకిస్థాన్ డీలర్ కశ్మీర్ వ్యవహారంపై సోషన్ మీడియాలో చేసిన ఓ పోస్టు తీవ్ర రుమారాన్ని రేపింది. దీనిపై హ్యూందాయ్ క్షమాపణ చెప్పినా ఈ వివాదం సద్దుమణగలేదు. ఈ వ్యవహారంపై ఆ కంపెనీ సొంత దేశమైన దక్షిణ కొరియా రాయబారికి భారత్ సమన్లు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వాహనాలు విక్రయిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్..

మారుతీ తరువాత భారత దేశంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీ తన కార్లను పాకిస్థాన్ లో కూడా విక్రయిస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆ సంస్థ అధికారిక సోషల్ మీడియాలో పేజీలో పెట్టిన పోస్టు పాకిస్థాన్ కు అనుకూలంగా ఉందంటూ దుమారం రేగింది. దీనిపై భారత్ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీంతో కంపెనీ వెనక్కు తగ్గి పోస్టును తొలగించింది. అప్పటికే ఈ పోస్టు స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోస్టు తొలగించిన తరువాత హ్యూందాయ్ ప్రకటన విడుదల చేసింది. అయినా చాలా మంది నెటిజన్ లు బాయ్ కాట్ హ్యూందాయ్ అంటూ హాష్ టాగ్ తో వైరల్ చేస్తున్నారు.

Hyundai apologies on controversy tweet
Hyundai apologies on controversy tweet

Hyundai: అనుచిత పోస్టుపై భారత్ తీవ్ర అసహనం

ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా రాయబారికి కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. సోషల్ మీడియాలో వచ్చిన అనుచిత పోస్టుపై భారత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేశ భౌగోళిక సమగ్రతకు సంబంధించి విషయాల్లో రాజీపడే ప్రశ్న లేదని గట్టిగా స్పష్టం చేసింది. దీనిపై కంపెనీ తగిన చర్యలు తీసుకుంటుందని అశిస్తున్నామని కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్సీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇమ్ యాంగ్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడినట్లు బాగ్సీ వెల్లడించారు. అనేక అంశాలతో పాటు హ్యూందాయ్ వివాదం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు.

 

Read More: YS Jagan Schemes: సిఎం జగన్ ఆ సంక్షేమ పథకాలు ఆపేస్తారా..!?

ఆ సోషల్ మీడియా పోస్టు కారణంగా భారత ప్రభుత్వం, ప్రజలకు కల్గిన ఇబ్బందికి కొరియా మంత్రి విచారం వ్యక్తం చేసినట్లు బాగ్సీ పేర్కొన్నారు. ‘పలు రంగాల్లో విదేశీ కంపెనీల పెట్టుబడులను భారత్ స్వాగతిస్తుంది. అయితే దేశ భౌగోళిక సమగ్రత, సౌభ్రాతృత్వానికి సంబంధించిన అంశాలపై దుష్ప్రచారం చేయకుండా ఆ కంపెనీ జాగ్రత్తగా ఉండాలి’ అని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది.  ఈ వివాదంపై హ్యూందాయ్ మోటార్ ఇండియా నిన్న మరో సారి ప్రకటన విడుదల చేసింది. పాక్ లోని హ్యూందాయ్ స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే అ అనధికారిక పోస్టు వల్ల దేశ ప్రజలకు బాధ పెట్టినందుకు చింతిస్తున్నట్లు తెలిపింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?