NewsOrbit
న్యూస్

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కంటే నేనే సీనియర్!మాటల తూటాలు పేల్చిన విజయశాంతి!!

ఇటీవలే బీజేపీలో చేరిన సినీ నటి విజయశాంతి తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద పంచ్ డైలాగులు విసిరారు.తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ముందు ప్రారంభించింది తానే అని, ఆ తర్వాతే కేసీఆర్ ఆ ఆ లైన్ అందుకున్నారని ఆమె చెప్పారు.

అది కూడా తనకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి రాకపోవడంతో కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని వైకుంఠ పాళి గా చేసుకొని అందలమెక్కారన్నారు.ఈ సందర్భంగా విజయశాంతి తన రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు.తాను బీజేపీలోనే ఉంటూ తెలంగాణ కోసం ఉద్యమించానని,అయితే అప్పట్లో తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో తాను బిజెపి నుండి బయటకొచ్చి తల్లితెలంగాణ పార్టీ పెట్టానని ఆమె తెలిపారు.తాను బీజేపీని వీడినందుకు అప్పట్లో చాలా బాధపడ్డానని కన్నీళ్లు కూడా పెట్టుకున్నానని విజయశాంతి మీడియాకు చెప్పుకున్నారు.బీజేపీ తనను బాగా ఆదరించిందని,ఒకదశలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పోటీకి బిజెపి అభ్యర్థిగా తననే నిలబెడతానని అగ్రనేత అద్వానీ ప్రతిపాదించారన్నారు.అయితే తెలంగాణపై ప్రేమతో సొంతపార్టీ పెట్టుకున్నానని,ఆ ఉద్యమ క్రమంలో ముందుకు వెళ్తుండగా,కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి రంగంలోకి దిగారన్నారు.

అంటే తానే తెలంగాణ మలిదశ ఉద్యమంలో కెసిఆర్ కంటే సీనియర్ని ఆని విజయశాంతి చెప్పారు.తెలంగాణలో తనకు బాగా ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ తన చరిష్మా తట్టుకోలేక కుట్రతో  తల్లితెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని టైగర్ నరేంద్రను పంపారని అన్నారు.నరేంద్ర సుమారు ఇరవై అయిదు సార్లు అడిగాక కేసీఆర్ని తాను కలుసుకున్నానని,ఇద్దరిదీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆశయమే కాబట్టి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశానని ఆమె తెలిపారు.కాని ఆ నిమిషం నుంచే తనపై కేసీఆర్ కుట్ర ప్రారంభించారన్నారు.టీఆర్ఎస్ లో యాక్టీవ్ గా ఉన్న తనను పార్టీలో తానొక్కడినే ఎదగాలనే స్వార్ధంతో కేసీఆర్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

ఆ తర్వాత కాంగ్రెసులో వెళ్లానని ,ఇప్పుడు బిజెపిలో చేరడం ద్వారా స్వగృహప్రవేశం చేశానని చెప్పిన విజయశాంతి కెసిఆర్ నుద్దేశించి “బాషా” సినిమాలో చెప్పిన రజనీకాంత్ చెప్పిన “చెడ్డ వారు ముందు సుఖపడతారు ఆ తర్వాత అన్నీ కష్టాలే ..మంచివారు ముందు కష్టపడతారు.. ఇక జీవితాంతం సుఖాలే” అన్న పాపులర్ డైలాగును ఆమె మీడియా సమావేశంలో వినిపించారు.తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయిందని మొన్న దుబ్బాక ,నిన్న జీహెచ్ఎంసీ ,రేపు నాగార్జున సాగర్ ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయని ఆమె చెప్పారు.తెలంగాణ తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్నది కేసీఆర్ లక్ష్యమని అప్పట్లో టీడీపీ కాంగ్రెస్లు ఆయన వలలో పడ్డాయని,బీజేపీ ఆ కోవకు చెందిన పార్టీ కాదని,కెసిఆర్ ని ఇంటికి పంపించే వరకు నిద్రపోదని విజయశాంతి స్పష్టం చేశారు.

 

author avatar
Yandamuri

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?