అతి చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది దివంగత అతిలోకసుందరి నటి శ్రీదేవి. టీనేజ్ వయసులోనే వచ్చిన శ్రీదేవి దక్షిణాదిలో అలరిస్తూ హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోలందరి పక్కన నటించింది. ఎన్టీఆర్ హయాంలో నుండి చిరంజీవి వరకు టాప్ హీరోలందరితో నటించిన శ్రీదేవి బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా తన సత్తా చాటింది. అయితే ఎప్పుడైతే బోనీకపూర్ తో వివాహం జరిగిందో శ్రీదేవి జీవితం ఒక్కసారిగా మారిపోయింది.
ఇదిలాఉండగా బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భర్త బోనీ కపూర్ కి శ్రీదేవి తో అయిన రహస్య వివాహం గురించి అనేక సంచలన విషయాలు బయట పెట్టారు. నా జీవితంలో లో రెండో వివాహం రెండో భార్య గురించి విన్నాను గానీ అది నా జీవితంలో జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు అంటూ మోనా కపూర్ తెలిపారు. శ్రీదేవి తో తన భర్తకి వివాహం కాకముందు సొసైటీలో తనకు గౌరవం ఉండేదని కాలక్రమేణా అది పోయింది అని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా పిల్లలు అర్జున్ కపూర్, అన్షుల ని తోటి విద్యార్థులు ఏడిపించే వారని, ఇంటికి వచ్చి తనకు చెప్పుకొని బోరున ఏడ్చిన వారని ఇద్దరు నరకం చూశారని, అది చూసి నా జీవితం చాలా వరకు మనోవేదనకు గురైందని మోనా కపూర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన తండ్రికి శ్రీదేవితో సంబంధం అని తెలిసి అర్జున్ కపూర్ కుప్పకూలి పోయాడు. ఆ పరిస్థితులను వాడు రిసీవ్ చేసుకోలేకపోయాడు అని తెలిపింది. ఆ తర్వాత సమాజంలో తనపై కూడా అనేక విమర్శలు వచ్చాయి అని… ఆ సమయంలో బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా శ్రీదేవి తో బోనికపూర్ పెళ్లి అయిన సమయంలో నేను నా భర్తని ఇబ్బందులకు గురి చేయలేదని మోనా కపూర్ చెప్పుకొచ్చింది.