NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

దళితుడిని కాబట్టే సీఎం కాలేకపోయా: డిప్యూటీ సీఎం


దేవనగిరి: కర్ణాటక ఉపముఖ్యమంత్రి జీ పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడి కాబట్టే అణచివేయబడ్డానని, ముఖ్యమంత్రిని కాలేకపోయానని వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ జేడీఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని హెచ్‌డీ కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అడపాదడపా సీఎంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. దీంతో కుమారస్వామి కూడా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం పదవిని వదులుకునేందుకు కూడా తాను సిద్ధమేనని పలుమార్లు తేల్చిచెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.

దేవనగిరిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పరమేశ్వర మాట్లాడుతూ.. ‘తాను అణచివేతకు గురవడం వల్లే సీఎం పదవిని పొందలేకపోయాను. నాకు ఇష్టం లేకపోయినా డిప్యూటీ సీఎం పదవిని అంగీకరించా’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా అంటరాని తనం కొనసాగుతోందని అన్నారు.

గతంలో కూడా పరమేశ్వర ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని బీ బసవలింగప్ప, కేహెచ్ రంగనాథ్, ప్రస్తుత కలబురగి ఎంపీ మల్లిఖార్జున లాంటి దళిత నేతలు కూడా రాష్ట్రానికి నాయకత్వం వహించలేకపోయారని ఆయన అన్నారు. వీరందరికి సీఎం పదవిని చేపట్టే అర్హత ఉన్నప్పటికీ దళితులు కాబట్టే ఆ స్థాయికి చేరుకోలేకపోయారని వ్యాఖ్యానించారు.

ఇది ఇలా ఉండగా, సార్వత్రిక ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని దేవనగిరి ఎమ్మెల్యే, ఆల్ ఇండియా వీరశైవ మహాసభ(ఏఐవీఎం) అధ్యక్షుడు షమనూర్ శివశంకరప్ప ఇటీవల డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే కూడా ఖర్గే ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరని ధీమా వ్యక్తం చేశారు.

author avatar
Siva Prasad

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

Leave a Comment