NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

RGV vs Pawan Kalyan: హాట్ టాపిక్ గా ఫిఠాపురం .. పోటీకి దిగుతున్నట్లు ప్రకటించిన ఆర్జీవీ

RGV vs Pawan Kalyan: ఏపీ రాజకీయ వర్గాల్లో పిఠాపురం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పవన్ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికి రెండు సంచలన విషయాలు చోటుచేసుకున్నాయి. ఆ నియోజకవర్గం నుండి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.

టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు మంటల్లో వేసి దగ్ధం చేశారు. రేపు తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరో పక్క విలక్షణ  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు.

తాను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు పోటీ చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటన చేశారు. తాను పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి అర్జీవీ కూడా ఫిఠాపురం నుండి పోటీకి దిగుతున్నట్లు గా వెల్లడించడం గమనార్హం.

‘ఇది ఆకస్మిక నిర్ణయం. నేను పిఠాపురం నుండి పోటీ దిగుతాన్నా..ఈ విషయాన్ని తెలపడానికి చాలా సంతోషిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఏపీ రాజకీయాల స్పూర్తితో పొలిటికల్ థ్రిల్లర్ లుగా వ్యూహం, శపథం మూవీలను ఆర్జీవీ రూపొందించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

Mudragada Padmanabham

ఇప్పటికే వైసీపీ పిఠాపురం ఇన్ చార్జిగా సిట్టింగ్ ఎంపీ వంగా గీతను నియమించిన సంగతి తెలిసిందే. ఇదే నియోజకవర్గం నుండి వంగా గీత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వర్మ 45వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో ఉండగా, ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ అభ్యర్ధి పోటీ చేసి 43వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.

ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వర్మకు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వర్మపై వైసీపీ అభ్యర్ధి పెండెం దొరబాబు 14వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనసేన అభ్యర్ధి గా పోటీ చేసిన మాకినేని శేషు కుమారికి 28వేలకుపైగా ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

అయితే రేపో మాపో ముద్రగడ పద్మనాభం వైసీపీ తీర్ధం పుచ్చుకోనుండటంతో పవన్ కళ్యాణ్ పై పార్టీ ఆయనను పోటీకి దింపుతుందా లేక వంగా గీతనే బరిలో ఉంచుతుందా అనేది చర్చనీయాంశంగా ఉంది. ఈ తరుణంలో ఆర్జీవీ ఫిఠాపురం నుండి బరిలో దిగుతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

TDP: పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురంలో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం .. టీడీపీ జండాలు, ఫ్లెక్సీలు ధగ్ధం

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N