NewsOrbit
న్యూస్

ఔను వారిద్దరూ విడిపోవాలి అనుకుంటున్నారు..!

 

 

ఇద్దరు మంచిగా చదువుకున్నారు…, చూడగానే ప్రేమించుకున్నారు.., మతాలు వేరు అయినా అందర్నీ ఒప్పించి ఒకటి అయ్యారు…. నిండు నూరేళ్లు కలిసి ఉండాలి అనుకున్నారు…. కానీ మూడు మూళ్ళ బంధం మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోనుంది… నువ్వు లేక నేను ఉండలేను అన్నీనా జంట …. ఇప్పుడు ఒకరితో ఒక్కరు ఉండలేను అంటున్నారు….ఏడూ అడుగులతో ఒకటి అయినా జంట…. విడాకులు తో దూరం అవ్వాలి అనుకుంటున్నారు…దేశం లో ఎంతో ప్రతిష్టాత్మకం అయినా పదివిలో నిల్చి అందరికి ఆదర్శం గా నిల్చిన జంట… జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్య భర్తల పదవిలో ఓటమి పాలయ్యారు…. ప్రేమని జయించిన వివాహ బంధాన్ని నిలబెట్టుకోలేకపోయారు….. ప్రేమ పక్షులు విడాకులు తీసుకోవాలి అన్ని నిశ్చయించుకున్నారు…

 

ias ooficers

అసలు విషయానికి వెళ్తే, ఢిల్లీ కి చెందిన టీనా దాబి , చినప్పటి నుండి ఎంతో కష్టపడి చదువుకుంది. ఆమె కష్టానికి ఫలితం గా మొదటి ప్రయత్నం లోనే , 2015 సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో ఐఏఎస్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచింది. ఇంకా అథర్ ఖాన్‌ది జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ సమీపంలో ఒక చిన్న గ్రామం. ఇతను కూడా కష్టపడి చదువుకున్నాడు. 2015 సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లోనే సెకండ్ ర్యాంకర్ గా నిలిచాడు. ఇద్దరివీ పూర్తిగా భిన్న ధ్రువాలు. వీరిద్దరి నేపథ్యాలు వేరు, ప్రాంతాలు వేరు.. అంతకంటే ముఖ్యంగా మతాలు వేరు. తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. మొదటి, రెండో ర్యాంకులు సాధించిన వీరిద్దరినీ సన్మానించేందుకు నిర్వహించింన కార్యక్రమంలో, అథర్ తొలిసారిగా టీనాను చూశారు, ఆ రోజు సాయంత్రమే టీనాకు తన మనసులోని మాట చెప్పేశారు. టీనాను చూడగానే ప్రేమలో పడిపోయానని లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అన్ని చెప్పడం తో టీనా కూడా ఎస్ చెప్పేసారు. ఇద్దరు ఐఏఎస్ లు అవ్వడంతో కుటుంబాలు కూడా అభ్యంతరం చెప్పలేదు. అయితే హిందువు అయినా టీనా ముస్లిం ని పెళ్లి చేసుకోవడం పైన హిందూ మహాసభలు బహిరంగంగానే విమర్శించాయి . దీన్ని ఏమి లెక్కచేయని ఇరువురు ట్రైనింగ్ పూర్తి అయ్యాక 2018 లో కుటుంభం సభ్యుల సమక్షం లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఆ జంట అందరికీ ఆదర్శం అని కొనియాడారు. దీంతో వారి పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోయాయి.

 

ias officers teena dabbi athar khan

ఆ తరువాత పోస్టింగ్ కూడా ఇద్దరికీ ఒకే రాష్ట్రం లో రావడంతో, అనుకోని అదృష్టం గా భావించారు. వివాహమైన తర్వాత కొన్ని రోజుల పాటు ఈ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. పెళ్లి తర్వాత టినా దాబి తన పేరు చివరన ‘ఖాన్’ జత చేసుకున్నారు. అయితే పెళ్లి అయినా రెండు సంవత్సరాలకే వీరి మధ్య భేదాభిప్రాయాలు రావడం ప్రారంభం అయ్యాయి. అయితే.. కొద్ది రోజుల కిందట టినా దాబీ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు చివరన ఖాన్ తొలగించారు. ఆ వెంటనే అథర్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో టినాను అన్‌ఫాలో అయ్యారు. ఇద్దరు చదువుకున్నవారు కావడం తో అర్ధం చేసుకొని కలిసి ఉంటారు అన్ని ఇద్దరి కుటుంభం సభ్యులు భావించారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ బేధాభిప్రాయాలు ఎక్కువ అవ్వడం తో విడాకులు కావాలంటూ ఈ ఐఏఎస్ దంపతులు జైపూర్ ఫ్యామిలీ కోర్టు 1లో దరఖాస్తు చేసుకున్నారు. తామిద్దరం కలిసి జీవించలేమని,తమకు విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దేశంలో వీరి ప్రేమ పెళ్లి ఎంత హాట్ టాపిక్ అయ్యాయో, ఇపుడు విడాకులు కూడా అంతే హాట్ టాపిక్ గా మారిపోయాయి. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలా ఎందుకు చేశారంటూ అంతా చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి వారిద్దరూ నోరు విప్పితే కానీ అసలు విషయాలు బయటికి వచ్చేలా లేవు.

అందరికి ఆదర్శం గా నిలవాల్సిన జంట, ఇలా విడాకులు తీసుకోవడం ఏంటి అన్ని బిగ్ డిబేట్ ఏ జరుగుతుంది. మరి వీరి విడాకులు వెనుక ఉన్న కారణాలు గురించి వారు చేప్తే కానీ తెలియదు.

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N