NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Ukraine Russia War: రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు.

Ukraine Russia War: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. మూడు వారాలుగా ఉక్రెయిన్ పై రష్యా భీకర పోరు సాగిస్తోంది. ఉక్రెయిన్ లోని అనేక నగరాలు క్షిపణి దాడులు, బాంబు దాడులతో ధ్వంసం అయ్యాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు కొనసాగిస్తుండగా ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది  ప్రపంచ దేశాల ఆంక్షలను సైతం లెక్క చేయకుండా రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ తరుణంలో రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ పై చేస్తున్న సైనిక చర్యను వెంటనే నిలుపుదల చేయాలని, ఆ దేశ భూభాగం నుండి రష్యా తన సైనికులను ఉపసంహరించుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ భూభాగంపై ఇక నుండి రష్యా సేనలు గానీ, దానికి మద్దతు ఇచ్చే సాయుధ బలగాలు గానీ ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని కోర్టు అధ్యక్షుడు, యూఎస్ న్యాయమూర్తి జోన్ ఈ డోనోగ్యూ తెలిపారు.

ICJ Key Orders On Ukraine Russia War
ICJ Key Orders On Ukraine Russia War

Ukraine Russia War: రష్యా సైనిక చర్య ఆపేయాలి

ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య చేపట్టిన నేపథ్యంలో రెండు వారాల క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు తీర్పు వెల్లడించింది. రష్యాపై ఐసీజేలో వేసిన కేసులో తమ దేశం పూర్తిగా విజయం సాధించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. మరో పక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు విజ్ఞప్తి మేరకు భారీగా సాయం అందజేస్తామని పేర్కొంది. ఉక్రెయిన్ కు అండగా నిలుస్తామనీ, ఉక్రెయిన్ పై రష్యా విజయం సాధించనీయమని స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju