కరోనా వైరస్ వ్యాక్సిన్ పనితీరు పై ఐసిఎంఆర్ వ్యాఖ్యలు

 

ప్రపంచం మొత్తాన్ని కరోనా వణికిస్తుంది.  ఆర్దిక వ్యవస్థ చిన్నా భిన్నం అయింది. కరోనా వైరస్ ను నియంత్రించే వ్యాక్సిన్ కోసం       ప్రజలు  ఎదురుచూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ త్వరలో రానున్నదని వార్తలు వస్తున్న నేపధ్యంలో  వ్యాక్సిన్  పనితీరుపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసియంఆర్ )  డైరక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ బార్గవ చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాసం అవుతుంది.

ఏ వ్యాక్సిన్ అయిన వంద శాతం సమర్ధవంతంగా పనిచేయదని ఆయన వ్యాఖ్యానించారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులకు వినియోగించే ఏ టీకా కూడా నూరు శాతం పని చేయవని అన్నారు. వ్యాక్సిన్ తయారిలో భద్రత, వ్యాధి నిరోధకత, సమర్ధత ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని, 50 శాతం పనితీరును చూసి టీకాను ఆమోదించాలని  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్  (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. దీంతో తాము వంద శాతం సమర్ధవంతంగా పనిచేసే విధంగా టార్ గేట్ పెట్టుకున్నామన్నారు. కాగా టీకా పనితీరు 50 నుండి 100 శాతం మధ్య ఉంటుందని, 50 నుండి 100 శాతం మధ్య ఉంటేనే దానిని వినియోగానికి అనుమతిస్తారని డీజీ బలరామ్ భార్గవ పేర్కొన్నారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ  తయారు చేసిన కరోనా  వ్యాక్సిన్ తొలి దశ క్తీనికల్ ట్రైల్స్ లో భాగంగా  పలువురి మీద ప్రయోగించగా ఆ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులలో వ్యాధి నిరోధక శక్తి పెరింగిందని, ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని పరిశోధకులు తెలియజేశారు. ఇప్పటి వరకు పలు సంస్థల వ్యాక్సిన్ ప్రయోగాలలో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి.

ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెన్ కా, భారత్ బయోటెక్, జైడస్ కాడిలా వ్యాక్సిన్ లు మానవ క్లీనికల్ దశలో ఉన్నాయి.  ఇదిలా ఉండగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ కు విరుగుడు కోసం ప్రపంచలోని ప్రజలు ఎదురు చూస్తున్న ఈ తరుణంలో  వ్యాక్సిన్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డైరక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.