కరోనా పై కొత్త విషయాలు..! పోషకాలుపై కీలక అంశాలు చెప్పిన ఐసీఎంఆర్

 

కరానా ను జయించాలంటే ?   కంచంలో పోషకాలు ఉండాలి….ప్రజలను పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. దాని భారిన పడకుండా ఉండాలంటే మరి కొంత కాలం జాగ్రత్తగా ఉండక తప్పదు. ముఖ్యంగా  మరికొంత కాలం జాగ్రత్తగా ఉండక తప్పదు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రావడానికి మరి కొంత సమయం పడుతుందని తల పండిన వైద్య మేథావులు చెపుతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా 2021 మార్చి వరకు వ్యాక్సిన్ రావడం కష్టమే అని చెప్పకనే చెప్పారు. అప్పటి వరకు రోగనిరోధక శక్తి పెంచుకొని తగిన జాగ్రత్తలు పాటించక తప్పదు.

కరోనా భారిన పడకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  ఏ ఆహారం తీసుకోవాలి, పోషకాలు ఏ మోతాదులో ఉండాలి, ఏ ఆహారంలో ఏ పోషకాలు ఉంటాయి, వివరిస్తూ..ఇటివలే ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది.  భారతదేశంలో ఎక్కువ మంది అల్ప ఆదాయం కలిగిన వారే. 2016 జాతీయ నమూనా సర్వే నివేదిక ప్రకారం దేశంలో చిన్న, సన్నకారు రైతుల నెలసరి ఆదాయం 7,348 రూపాయలు వరకూ ఉంది. మన దేశంలో ఎక్కువ మంది సన్నకారు రైతు కుటుంబాలే. రోజు వారి వేతనాలకు పనిచేసే వారు, స్వయం ఉపాధి పొందేవారు అనేక మంది అల్ప ఆదాయం కలిగిన వారే.

కడుపు నింపకోవడానికే కోటి తిప్పలు పడుతున్నారు. అధిక పోషకాలు కలిగి ఉన్న పౌష్టికాహారం ఎక్కడ నుండి తేవాలి…పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఇది సాధ్యమేనా.. అంటూ పోషకాహార నిపుణులు పలువురు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో చౌకగా లభ్యమయ్యే పోషకాహారలపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు. అలాగే

చౌక దుకణాల ద్వారా మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్ధాలను అందుబాటు లో ఉంచాలని సూచిస్తున్నారు. ఐసీఎంఆర్ సూచనల మేరకు పౌష్టిక ఆహారం తినాలంటే రోజుకు ఒక్కరికి సుమారు 300 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. కుటుంబ ఆదాయమే అంత లేనప్పుడు కుటుంబం పౌష్టికాహారం కోసం ఎంత ఖర్చు పెట్టాలి. ఇది సాధ్యమేనా… నిజం మాట్లడు కోవాలి అంటే.. దేశంలో 70 శాతం మందికి  అది ఆచరణ సాధ్యం కాదు.. అనేది పలువురి అభిప్రాయం.

 

చౌకధరలో పోషకాలు ఉన్నవి ఎన్నో…

మనం రోజు వారీ వాడే ఆహార పదార్ధాల్లో ఎక్కువ శాతం పోషకాలు, ప్రోటిన్లు ఉండే విధంగా చూసుకోవాలని సహజ ఆహారోత్పత్తుల నిపుణుడు విజయరామ్ తెలిపారు. నువ్వలు, నువ్వుల పప్పు నుంచి నూనే తీసిన తరువాత వచ్చే తెలగపిండిలో చాలా పోషకాలు ఉంటాయని చెప్పారు. కానీ ఆ తెలగపిండి పశువులకు దాణాగా వాడుతుంటారని అన్నారు.  తెలగపిండితో అనేక రకాల కూరలలో వాడుకోవచ్చు అని సూచించారు. పెసలు, శనగలు నానబెట్టి మొలకలు వచ్చాక వాటిని తీసుకోవడం వలన వాటిలో ప్రోటీన్లు, హార్మోన్లు, ఎంజైమ్ లు లభిస్తాయని వివరించారు. రాగులు, సజ్జలు, జొన్నలను నానబెట్టి మొలకలు వచ్చాక ఎండబెట్టి పొడి చేసుకొని వాడాలని వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు. వేయించిన కందిపప్పు, లేదా పెసరపప్పును పొడి చేసి ధనియాలు, మిర్చి, జీలకర్ర, ఉప్పు వంటి వాటిని కలిపి పొడిలా చేసుకొని అల్పహారంలో వాడుకోవచ్చునని తెలిపారు.