Born baby: ఈ నక్షత్రం లో శిశువు  పుడితే   అశ్వాన్ని దానంగా ఇవ్వాలి!!

Share

Born baby: పుష్యమి నక్షత్రం, కర్కాటక లగ్నంలో  డే టైం  బాబు   పుడితే తండ్రికి గండం ఉంటుంది. అదే నైట్ టైం    పాప పుడితే  తల్లికి గండం  ఉంటుంది.   పుష్యమి నక్షత్రం    1 వ పాదములో పుడితే మేనమామకు 2  పాదములో పుడితే  తల్లిదండ్రులకు దోషం  కలుగుతుంది . మూడు, నాలుగో పాదంలో  పుట్టిన వారికి సామాన్య దోషం  ఉంటుంది . వీరికి శాస్త్రోక్తంగా శాంతి చేసుకోవడం మంచిది . గంధపు చెక్కను దానంగా   ఇస్తే దోషం పోతుంది.

ఆశ్లేష నక్షత్రం  1వ పాదం   జన్మిస్తే వారికి   దోషము  కలుగదు .  2 వ పాదము     పుట్టిన శిశువులకు, 3 వ పాదము  జననం  తో ఆ శిశువు  తల్లికి 4 వ పాదము జననం  తో శిశువు   తండ్రికి దోషం ఉంటుంది . నాలుగో పాదంలో పుట్టిన  వారికి బాగా  శాంతి చేయించడం  చాలా అవసరం. ఈ నక్షత్రం   చివర 24 నిమిషాలు పాటు సంధి సమయం ఉండును.
మఖ నక్షత్రం 1 వ పాదములో జన్మించిన  శిశువు తో    బిడ్డ నాన్న కు  5 నెలల వరకు దోషం ఉంటుంది.  మఖ  నక్షత్రం మొదలైన  మొదటి 24 నిమిషాలు  బహు దోషం గా చెప్పబడింది . ౩ వ పాదములో  జన్మించిన  శిశువు   వలన    అమ్మ ,నాన్నవీరిద్దరికి   దోషము ఉంటుంది. అశ్వము దానమిచ్చుట  తో దోషం  తొలగుతుంది . 2, 4 పాదాలలో జన్మించిన దోషము లేదు.

Born baby:  పుబ్బ నక్షత్రం  ఏ  పాదము లో   శిశువు జన్మించిన కూడా   దోషం   కాదు.

ఉత్తర నక్షత్రంలో  1, 4 వ పాదంలో  పుట్టిన శిశువు  తో  మాతృ , పితృ , సోదరుల కు   దోషం  ఉంటుంది. నూనె పాత్ర దానం  ఇవ్వాలి . మిగతా 2, 3 పాదములో  జన్మించిన వారికి వారికి దోషము లేదు.
హస్తా నక్షత్రం 3 వ పాదము లో  జననం జరిగిన  మగ పిల్లాడి  వలన శిశువు తండ్రి,  ఆడపిల్ల వలన శిశువు తల్లికి దోషము  వస్తుంది. మిగిలిన  1, 2, 4 పాదాలలో జన్మించిన వారికి దోషము  ఉండదు.కొన్ని సార్లు నక్షత్రం లో  సమస్య లేకపోయినా కూడా  దుష్ట తిధి దోషం ఉండటం వలన , వర్జ్యము ఉండుట వలన , దుర్ముహూర్త కాలము ఐన , గ్రహణ సమయం లో   పుట్టిన వారికి   శాంతి చేయించుట  తప్పనిసరి.


Share

Related posts

ఈసారి 287 డిజైన్లతో సరికొత్తగా బతుకమ్మ చీరలు.. ఆరోజు నుంచి అందరికీ పంపిణీ

Varun G

Kushi Kushiga : ఖుషీ ఖుషీగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో అదుర్స్

Varun G

మహా నగరం..! మహా సముద్రమైన వేళ

somaraju sharma