NewsOrbit
న్యూస్

ఆదివాసీకి పదవిస్తే అందలం దక్కేనా? ఏమిటీ బిజెపి లెక్క ??

అధికారం దక్కించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తుంటాయి.ఇది సహజం.అయితే వార్డు మెంబరు కూడా లేని ఏపీలో ఏకంగా అధికారంలోకి వచేయడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.

If a tribal is elected, will he get majority What is BJP calculation
If a tribal is elected, will he get majority What is BJP calculation

ఇతర రాష్ట్రాల్లో వర్కవుటైనా ఒక స్కీమును ఆంధ్రప్రదేశ్ లో కూడా బిజెపి అమలు చేయటం ఇప్పుడు వార్తగా మారింది.ఒక ఆదివాసీ నాయకుడికి బిజెపిలో కీలకమైన పదవి ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పవర్ గేమ్ ని కమలనాధులు ప్రారంభించారు.బీజేపీకి జార్ఖండ్, ఒడిషా లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టుంది. అక్కడ గిరిజనులను తమ వైపు తిప్పుకుని పొలిటికల్ గా ఎన్నో రకాలైన మ్యాజిక్కులు చేసింది. ఇక ఏపీలో కూడా అదే ప్రయోగం చేయాలనుకుంటోంది.నిజానికి ఏపీలో గిరిజనులు పూర్తిగా వైసీపీ వైపు ఉన్నారు. నాలుగు జిల్లాలు విస్తరించి ఏడు ఎస్టీ సీట్లు ఉంటే మొత్తానికి మొత్తం 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది.

2014 ఎన్నికల్లోనూ ఇందులో ఆరు వైసీపీ గెలుచుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంకా చెప్పాలంటే గిరిజనులకు బాగా తెలిసిన ముఖ్యమంత్రులిద్దరే ఇద్దరు .వారు కేవలం వైఎస్సారు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాలను మాత్రమే గుర్తు పడతారంటే వారి గుండెల్లో ఆ ఇద్దరికీ ఎలాంటి స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇక జగన్ బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసి వారికి ఇంకా చేరువ అయ్యారు. నిజానికి ఈ బంధాన్ని వేరు చేయడం కష్టమే కానీ బీజేపీ మాత్రం రాజకీయ ప్రయోగం చేస్తోంది.ఇందులో భాగంగా విశాఖ జిల్లా నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన లోకుల గాంధీ ని ఇపుడు బీజేపీ ఏకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేసింది. అంటే ఏజెన్సీలో ఇంత స్థాయిలో జాతీయ పార్టీలో పదవి పొందిన వారు లేరు.

Lokula Gandhi Page - Home | Facebook

ఆ విధంగా ఆయన్ని ఫోకస్ చేసి ఏజెన్సీ ఓట్ల వేటకు బీజేపీ రెడీ అవుతోంది. ఇక ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ఆదీవాసీలతో ఎపుడూ టచ్ లో ఉంటారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడం, వారి బాగోగులు చూడడం ద్వారా చేరువ అవుతూ ఉంటారు. ఇపుడు ఇదే మంత్రంతో ఏజెన్సీలో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. అయితే బిజెపి ప్రయత్నం వెంట్రుకతో ముడివేసి కొండను కిందకు దింపాలనట్లుగా ఉందని సెటైర్లు పడుతున్నాయి.ఆదివాసీల గుండెల్లో జగన్ ముద్రను చెరిపేయడం జరిగే పని కాదని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు మరి బిజెపి లెక్కలు ఎలా ఉంటాయో భవిష్యత్తులో తేలుతుంది.

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!